తిక్క కుదిరింది : కరోనాపై ఫ్రాంక్ వీడియో.. యువకుడికి ఐదేళ్లు జైలు

సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా

  • Edited By: veegamteam , February 13, 2020 / 09:39 AM IST
తిక్క కుదిరింది : కరోనాపై ఫ్రాంక్ వీడియో.. యువకుడికి ఐదేళ్లు జైలు

సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా

సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోల హడావుడి మామూలుగా లేదు. ఫ్రాంక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్రాంక్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. నవ్వులు పూయిస్తాయి. దీంతో చాలామంది ఔత్సాహికులు ఫ్రాంక్ వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అయితే.. ఫ్రాంక్ వీడియోలు దేని మీద చేయాలి, దేని మీద చేయకూడదు అనే కామన్ సెన్స్ ఉండాలి. లేదంటే.. జైలు పాలు అవ్వాల్సి ఉంటుంది. చిప్ప కూడు తినడం ఖాయం.

కోవిడ్-19(covid-19) అదేనండి కరోనా వైరస్(coronavirus).. చైనాలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చెమట్లు పట్టిస్తోంది. మనుషులు ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే చాలా దేశాలకు ఈ వైరస్ పాకింది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు. ఎప్పుడు కనుక్కుంటారో క్లారిటీ కూడా లేదు. దీంతో జనాలు ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతికేస్తున్నారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంటే.. ఓ ప్రబుద్ధుడు ఓవరాక్షన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. కటకటాల పాలయ్యాడు. కోవిడ్-19 పై ఫ్రాంక్ వీడియో చేసి అరెస్ట్ అయ్యాడు.

తనకు కరోనా వైరస్ సోకిందంటూ మెట్రో రైల్లో ప్రయాణికులను భయందోళనలకు గురిచేసిన ఓ యువకుడికి రష్యా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మాస్కోలో వెలుగుచూసింది. తజికిస్థాన్ దేశానికి చెందిన కరోమాతుల్లో జాబోరోవ్.. మాస్కో నగరంలో మెట్రో రైలెక్కాడు. కొంతదూరం వరకు బాగానే ఉన్న అతడు.. సడెన్ గా.. తనకు కరోనా వైరస్ ఉందని ప్రకటించాడు. ముఖానికి మాస్క్ ధరించి కింద పడ్డాడు. ఆ తర్వాత గిలగిల కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇది చూసిన తోటి ప్రయాణికులను భయాందోళన చెందారు. అతడికి నిజంగా కరోనా వైరస్ సోకిందేమోనని భయపడ్డారు. అతడికి దూరంగా పరుగులు తీశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ చిలిపి చేష్టలన్నీ తన స్నేహితుడితో వీడియో తీయించిన యువకుడు.. కరోనా ఫ్రాంక్ పేరిట తన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో షేర్ చేశాడు.

అతడు సరదాగా చేసిన పని.. ఇరుకున పడేసింది. అతడి తిక్క కుదిర్చింది. మెట్రో రైల్లో చిలిపి చేష్టలు చేసి కరోనా వైరస్ పై ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసిన వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. కరోమాతుల్లోను మాస్కో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. తప్పు చేశాడని, చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కరోనా వైరస్ గురించి ప్రయాణికుల్లో అవగాహన పెంచడానికే కరోమాతుల్లో ఈ ఫ్రాంక్ వీడియో చేశాడని అతని తరపు న్యాయవాది అలెక్సీ కోర్టులో వాదించాడు. అతడి వాదనలతో జడ్జి ఏకీభవించలేదు. యువకుడు చేసిన పనిని తప్పుపట్టారు. అతడిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో పోలీసులు యువకుడిని జైలుకి తరలించారు.

సరదా కోసం యువకుడు చేసిన పని.. ఇరుకున పడేసింది. ఆ యువకుడు చేసిన పనిని నెటిజన్లు కూడా తప్పుపట్టారు. తగిన శాస్తి జరిగిందన్నారు. అసలే వైరస్ గురించి జనాలు భయపడి చస్తుంటే.. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి శిక్షలు పడితే కానీ.. తిక్క కుదరదన్నారు. మరోసారి ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేయాలంటే భయపడేలా కోర్టు తీర్పు ఉందని కామెంట్ చేశారు. అసలు దేని మీద ఫ్రాంక్ వీడియో చేయాలి దేని మీద చేయకూడదో అనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Click Here>>కరోనా వైరస్ ఎఫెక్ట్: వాటికి పెరిగిన డిమాండ్