Amazon employees Lay offs : 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న అమెజాన్

బడా బడా సంస్థలే ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బతో ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు బాటలో అమెజాన్ కూడా చేరింది. 20,000మంది ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడింది అమెజాన్.

Amazon employees Lay offs : 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న అమెజాన్

Amazon employees Lay offs : బడా బడా సంస్థలే ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బతో ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. దీనికి చిన్న సంస్థలే కాదు అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలుకూడా అదే బాటలో పనయనిస్తున్నాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక మొదలైన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్ సహా పలు టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించివేస్తున్నాయి. వీటి బాటలోనే పెప్సీ కో కూడా చేరింది. వందలాదిమంది ఉద్యోగుల్ని తొలగించే పనిలో పండింది.  ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకులే కారణంతోనే ఉద్యోగుల్ని తొలగిస్తున్నామని చెబుతున్నాయి సదరు సంస్థలు. 2025 నాటికి దాదాపు 6 వేల మందిని తొలగిస్తామని హెచ్‌పీ ఇటీవల ప్రకటించింది. అలాగే అమెజాన్ 20,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తోంది. అమెజాన్ ముందుగా 10,000 తొలగిస్తున్నట్టు వార్తలు రాగా ఆ తర్వాత అదికాస్తా 20,000 పెరిగింది. ఈ తొలగింపుల్లో అన్ని గ్రేడ్ల ఉద్యోగులూ ఉన్నారు.

ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖర్చుల తగ్గింపులో భాగంగా అమెజాన్‌ కంపెనీ దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న టెక్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులను తొలగించుకునే పనిలో పడిందని కంప్యూటర్‌వరల్డ్ వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వర్కర్లు, టెక్నాలజీ స్టాఫ్‌, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వివిధ విభాగాలకు చెందిన 20,000మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. 10,000మంది ఉద్యోగులన అమెజాన్ తొలగించనుంది అని గత నవంబర్ లో న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కానీ అదికాస్తా 20,000మందికి చేరిందని కంప్యూటర్‌వరల్డ్ వెల్లడించింది. రాబోయే నెలల్లో ఈ లేఆఫ్స్‌ ఉంటాయని, కొన్ని సోర్సెస్‌ ద్వారా కంప్యూటర్ వరల్డ్‌కి తెలిపింది.

PepsiCo To Cut Jobs : వందలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న పెప్సీ కో..

అమెజాన్‌ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడం ఆశ్చర్యపడాల్సిన అంశం కాదు. అమెజాన్ CEO ఆండీ జాస్సీ ఇటీవల అమెజాన్ అనేక విభాగాలలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోందని ధృవీకరించారు. ఆరు శాతం కార్పొరేట్ సిబ్బందిని, అమెజాన్ 1.5 మిలియన్ల వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 1.3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, గంటలవారీగా పనిచేసే వర్కర్స్‌ కూడా ఉన్నారు. ప్రభావిత ఉద్యోగులకు 24 గంటల నోటీసుతో పాటు వేతనం కూడా అందజేస్తారని, కార్పొరేట్ సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది.

ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు బయటకు రావడంతో కంపెనీలోని ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. ఎవరిపై ఈ వేటు పడనుందో అని ఆయా ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. కరోనా సమయంలో అధిక నియమాలు, కంపెనీ ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్న కారణాలతో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని తెలుస్తోంది.

ఓ ప్రకటనలో భాగంగా గతంలో అమెజాన్‌ సీఈవో మాట్లాడుతూ తొలగింపు ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగుతుందని..కంపెనీ ప్రతిదీ అంచనా వేసిన తర్వాతే ఆయా విభాగాల్లో సంబంధిత ఉద్యోగులకు తెలియజేస్తుందని ప్రకటించారు. ఖర్చును తగ్గించుకోవటానికి అన్ని ప్రాంతాల్లోని అన్ని విభాగాలను సమీక్షించి..తొలగింపుల సంఖ్య ఉండనుంది.