గుంతలో పడ్డ అంబులెన్స్ : లేచి కూర్చున్న పేషెంట్

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 10:29 AM IST
గుంతలో పడ్డ అంబులెన్స్ : లేచి కూర్చున్న పేషెంట్

మరక మంచిదే అనే యాడ్ లాగా రోడ్డు మీద గుంతలు మంచివే..ఈ గుంతలు ఒకోసారి ప్రాణాలు తీస్తాయి. ప్రాణాలను కూడా నిలబెడతాయి. రోడ్డు మీద ఉన్న ఓ గుంత ఓ మనిషి ప్రాణాల్ని నిలబెట్టింది.

స్నేహితులతో సరదాగా జోకులేస్తు సంతోషంగా మాట్లాడే ఓ 59 సంవత్సరాల వ్యక్తి హఠాత్తుగా గుండె పట్టుకొని పడిపోయాడు. కంగారుపడిన స్నేహితులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. హుటాహుటిన వచ్చేసిన అంబులెన్స్ సిబ్బంది..పేషెంట్‌ను పరిక్షించారు. వాళ్లు కూడా కంగారుపడ్డారు. ఎందుకంటే అతని గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటోంది. వెంటనే ఆస్పత్రికి తరలించాలించాలన్నారు. అక్కడకు 10 కిలో మీటర్ల దూరంలోని ఆస్పత్రికి హడావిడిగా బయలుదేరారు. 
Also Read : దారుణం : బిల్లు కట్టలేదని అవయవాలు తీసుకున్న ఆస్పత్రి

అలా అంబులెన్సు రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడింది. అంబులెన్స్ భారీ కుదుపుకు గురైంది. దాంతో డ్రైవర్‌పై అంబులెన్సు కోప్పడ్డారు. లోపల పేషెంట్ ఉన్నాడని కామన్ సెన్స్ లేకుండా ఏంటా స్పీడ్ అంటు ఆగ్రహించారు. తీరా పేషెంట్ పరిస్థితి చూడగా..సదరు పేషెంట్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. దాంతో వారు షాక్ అయ్యారు. తరువాత ఆస్పత్రుకు చేరుకున్నారు. పేషెంట్ ను పరిక్షించిన డాక్టర్స్ అంబులెన్స్ గుంతలో పడటమే అతడిని ప్రాణాలు కాపాడిందని  చెప్పారు. గుంతలో పడ్డ అంబులెన్స్ భారీ కుదుపుతో అతని గుండె..మళ్లీ నెమ్మదిగా సాధారణ స్థాయిలో కొట్టుకుందని..ఇది నిజంగా అద్భుతమంటున్నారు. 

కాగా సాధారణంగా గుండె వేగం పెరిగితే సదరు వ్యక్తికి  కరెంట్ షాక్ ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. అమెరికాలో ఏప్రిల్ 15న  నెబ్రస్కాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ రోడ్డు మీద ఉన్న గుంతలన్నీ మనిషి ప్రాణాలకు మంచి చేస్తాయని అనుకోవద్దు..ఈ గుంతల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం తెలిసిందే. 
Also Read : ఊపు ఊపుతున్న ముంబై, దిల్లీ ది కుడియా సాంగ్