59 ఏళ్ల వ్యక్తికి కరోనా..243 రోజుల చికిత్స, క్షేమంగా ఇంటికి

59 ఏళ్ల వ్యక్తికి కరోనా..243 రోజుల చికిత్స, క్షేమంగా ఇంటికి

man returns home : కరోనా సోకడంతో 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 243 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అన్ని రోజుల పాటు చికిత్స పొందడం రికార్డు అంటున్నారు. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ పైలట్ Nicholas Synnott కు 59 ఏళ్ల వయస్సు ఉంది. మార్చ్ లో Houstonకు విమాన ప్రయాణం తర్వాత…అస్వస్థతకు గురయ్యాడు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో Houston ఆసుపత్రిలో చేరాడు. కరోనా సోకిందని వైద్యులు గుర్తించారు. వెంటిలెటర్ ద్వారా చికిత్స అందించారు. గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు కూడా వచ్చాయి. అతని శరీరంలోని ప్రతి అవయవాలు కరోనాతో ప్రభావితమయ్యాయని, అనారోగ్యానికి ముందు..అతని ఆరోగ్యం చాలా బాగుందని చికిత్స చేసిన Biswajit Kar (Cardiologist) వెల్లడించారు. తిరిగి ఆరోగ్యంగా ఉండగలడనే నమ్మకం కలిగిందన్నారు. కరోనా బారిన పడి..క్షేమంగా బయటపడినందుకు తమకు సంతోషంగా ఉందన్నారు.

కోలుకోవడంలో అతని భార్య పాత్ర కీలకమని నమ్ముతామని Dr Bindu Akkanti (critical care specialist) తెలిపారు. తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు Synnott తెలిపారు. టెంపరేచర్ 100 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉందని, మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని Synnott వెల్లడించాడు. తన ఆలోచనలు, భార్య, కుటుంబసభ్యుల మద్దతుతో తిరిగి కోలుకున్నట్లు తెలిపారు. కానీ..ఇది చాలా కష్టమైన ప్రయాణంగా అభివర్ణించారు. మరలా హూస్టన్ ను సందర్శించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.