5G Rollout : అమెరికాలో 5జీ సేవలు.. ఎయిర్ ఇండియా విమాన సేవలు ప్రారంభం

తాత్కాలికంగా ఆగిపోయిన 8 విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి.

5G Rollout : అమెరికాలో 5జీ సేవలు.. ఎయిర్ ఇండియా విమాన సేవలు ప్రారంభం

5g America

5G Rollout : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 5జీ టెలీ కమ్యూనికేషన్ సేవలు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చాయి. US టెక్ దిగ్గజాలైన ఏటీ అండ్ టీ,వెరిజాన్ టెలికాం సంస్థలు అన్ని రాష్ట్రాల్లోనూ 5జీ సేవలు ప్రారంభించాయి. భారత్ సహా.. పలు దేశాల ఎయిర్ లైన్స్ సంస్థల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అమెరికా.. విమానాలకు అంతరాయం లేకుండా 5జీ సేవలు బుధవారం, 19 జనవరి 2022 నుంచి విస్తృత స్థాయిలో ప్రారంభించింది.

అమెరికాలోని కీలక విమానాశ్రయ ప్రాంతాల్లో ఈ 5జీ సేవలు పనిచేయవు. ల్యాండింగ్, టేకాఫ్, ట్రావెలింగ్ సమయంలో ఇబ్బందులు.. నావిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు రావొచ్చని.. సిగ్నల్ ఇంటర్‌ఫియరెన్స్ ఉండొచ్చని భారత ఎయిర్ లైన్స్ సహా పలు దేశాల విమానయాన సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఆయా దేశాల నుంచి అమెరికాకు, అమెరికా నుంచి ఆయా దేశాలకు రావాల్సిన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. అమెరికా వెళ్లే విమానాలను రీ షెడ్యూల్ చేశాయి. దీంతో.. భారత్ సహా పలు దేశాల ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు. అమెరికా వెళ్లాల్సిన 14 విమానాలను కూడా ఎయిర్ ఇండియా రద్దు చేసింది.

Read Also : Pushpa Memes : “డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా మాస్క్ తీసేదేలే”

యూరప్, జపాన్ సహా పలు డెవలప్‌డ్ కంట్రీస్ విమానాలకు 5జీ సిగ్నల్స్ తో ఇబ్బంది లేదు. ఇండియా సహా మరికొన్ని దేశాలు.. విమానాల్లో 5 జీ సిగ్నల్స్ కు తగ్గట్టుగా సిగ్నలింగ్ ను స్వల్పంగా మార్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విమాన సర్వీసులకు 5జీతో వచ్చే ఇబ్బంది కూడా తక్కువేనని చెప్పారు. ఐనప్పటికీ.. అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న అమెరికా సంస్థలు ఎయిర్ పోర్టు పరిసరాల్లో 5 జీ సేవలు నిలిపివేస్తున్నట్టు నిర్ణయించాయి. దీంతో.. ఇండియా నుంచి అమెరికాకు విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి.

తాత్కాలికంగా ఆగిపోయినవాటిలో దాదాపు 8 విమాన సర్వీసులు గురువారం ఉదయం మొదలయ్యాయి. భారీ విమానం B777 ను ఎయిర్ ఇండియా ఆపరేట్ చేసేందుకు బోయింగ్ సంస్థ కూడా ఓకే చెప్పింది. గురువారం ఫస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి జాన్ ఎఫ్ కెనడీకి వెళ్లినట్టు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. షికాగో, సాన్ ఫ్రాన్సిస్కోకు మిగతా ఫ్లైట్లు బయల్దేరాయి.

Read Also : Boris Johnson: కొవిడ్ రూల్స్ పాటించక్కర్లేదు.. మాస్కులు పెట్టుకోండి చాలు – బ్రిటన్ ప్రధాని