Earthquake : టోక్యోలో భారీ భూకంపం

జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.

Earthquake :  టోక్యోలో భారీ భూకంపం

Japan (2)

Earthquake  జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. టోక్యోకి తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్ ప్రధానకేంద్రంగా భూకంపం సంభవించినట్లు ఆ దేశ మెటియోరోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.1,భూగర్భానికి 80 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు తెలిపింది. భూకంపం కారణంగా టోక్యోలో కొన్ని చోట్ల బిల్డింగ్ లు షేక్ అయినట్లు సమాచారం. భూకంపం కారణంగా పలు బుల్లెట్ ట్రైన్స్ లైన్స్ ని కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

అయితే భూకపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం,ప్రాణనష్టం,ఎంతమందికి గాయాలయ్యాయి అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే సునామీ డేంజర్ ఏమీ లేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు.

ALSO READ విదేశీ పర్యాటకులపై నిషేధం ఎత్తివేత…నవంబర్-15 నుంచి టూరిస్ట్ వీసాలు

ALSO READ  పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20మంది మృతి.. 300మందికి గాయాలు