Tasmanian Devils: బతుకుతాయి కదా అని వదిలేస్తే 6వేల పెంగ్విన్లను బలి తీసుకున్నాయ్!!

తస్మానియన్ డెవిల్ అనే జాతికి 30ఏళ్లుగా చాలా గడ్డు కాలం నడుస్తోంది. క్యాన్సర్ లాంటి డెవిల్ ఫేసియల్ ట్యూమర్ జబ్బు వ్యాప్తి కారణంగా అంతరించిపోతూ ఉన్నాయి. వాటిని కాపాడటానికి అధికారులు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Tasmanian Devils: బతుకుతాయి కదా అని వదిలేస్తే 6వేల పెంగ్విన్లను బలి తీసుకున్నాయ్!!

Tasmanina Devils

Tasmanian Devils: తస్మానియన్ డెవిల్ అనే జాతికి 30ఏళ్లుగా చాలా గడ్డు కాలం నడుస్తోంది. క్యాన్సర్ లాంటి డెవిల్ ఫేసియల్ ట్యూమర్ జబ్బు వ్యాప్తి కారణంగా అంతరించిపోతూ ఉన్నాయి. వాటిని కాపాడటానికి అధికారులు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వాటిల్లో అవే బతకకుండా ఇతర జంతువులతో పాటు ఉంటే బెటర్మెంట్ ఉంటుందని ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే మనుషులు తక్కువగా ఉండే తస్మానియా తూర్పు ప్రాంతమైన మారియా ఐలాండ్ లో వాటిని విడిచిపెట్టారు. పెంగ్విన్లకు ఫ్యామస్ అయిన ఈ ప్రాంతంలో భూమి పైనే అతి చిన్న సైజులో ఉండే పెంగ్విన్లు కనిపిస్తాయి. పలు రకాల పక్షులు ఉండే అందమైన ప్రాంతంలో వదిలి పెడితే మార్పు వస్తుందని అనుకున్నారు.

అలా 2012లో తస్మానియా డెవిల్స్ ను వదిలిపెట్టగా రీసెంట్ గా బర్డ్ లైఫ్ తస్మానియా జరిపిన సర్వేలో అక్కడ ఒక్క పెంగ్విన్ కూడా లేదని తెలిసింది.

‘ప్రతి సారి కావాలనో.. లేదా అనుకోకుండానో ఏదైనా జంతువును ఆ సముద్ర తీర ప్రాంతాల్లో విడిచిపెడితే అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని డా.ఎరిక్ ఓలర్ అంటున్నారు. మొత్తం 3వేల జతల పెంగ్విన్లను ఐలాండ్ లో కోల్పోయాం. ఇది చాలా పెద్ద నష్టం అని విచారం వ్యక్తం చేస్తున్నారు.