20ఏళ్లుగా ఒంటరి : మగతోడు లేకుండా గుడ్లు పెట్టిన 62 ఏళ్ల కొండచిలువ

  • Published By: nagamani ,Published On : September 11, 2020 / 05:40 PM IST
20ఏళ్లుగా ఒంటరి : మగతోడు లేకుండా గుడ్లు పెట్టిన 62 ఏళ్ల కొండచిలువ

మగ పక్షి తోడు లేకుండా ఆడపక్షి గుడ్లు పెట్టదు. అలాగే ఏ జంతువైనా సరే మగ జంతువు లేకుండా పిల్లల్ని కనదు. అలాగే పాములైనా అంతే.. కానీ ఓ కొండ చిలువ (ball pythons జాతికి చెందిన) మాత్ర మగతోడు లేకుండానే గుడ్లు పెట్టింది. అదీకూడా రెండు దశాబ్దాలుగా (20 సంవత్సరాలు) మగతోడు లేని 62 సంవత్సరాల వయస్సున్న పైతాన్ పాము ఏడు గుడ్లు పెట్టటం విశేషం. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌ జూలో ఘటన జరిగింది.


దీని గురించి సెయింట్ లూయిస్‌ జూ లోని సరీసృపశాస్త్ర (హెర్పెటాలజీ) మేనేజర్ మార్క్ వానెర్ మాట్లాడుతూ.. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. కాగా..బాల్ పైథాన్ల విషయంలో ఇటువంటివి జరుగుతుంటాయని తెలిపారు. ఈ కొండచిలువలు అలైంగికంగా (అంటే లైంగికంగా మగపాముతో కలవకుండానే..వాటికవే పునరుత్పత్తి చేసుకోవటం) చేసుకునే.. పునరుత్పత్తి చేస్తాయని..కొమోడో డ్రాగన్స్‌తోపాటు ర్యాటెల్ స్నేక్స్ జాతికి చెందిన ఇతర జీవులు అలైంగికంగానే పునరుత్పత్తి చేస్తాయని వానెర్ తెలిపారు.


బాల్ పైథాన్‌లు సాధారణంగా 60 ఏళ్ల వయసు వచ్చేసరికి గుడ్లు పెట్టడం ఆపేస్తాయి..కానీ ఈ పైథాన్ మాత్రం 60 ఏళ్లు దాటి 62 ఏళ్ల వయస్సులో గుడ్లు పెట్టటం..పైగా మగ పైథాన్ తోడు లేకుండా గుడ్లు పెట్టటం విశేషమని అన్నారు. కానీ…ఈ వయస్సుల ఇటువంటి ప్రక్రియతో గుడ్లు పెట్టిన అతి పెద్ద వయసు కలిగిన కొండ చిలువ ఇదే అవుతుందని వానెర్ అన్నారు.


కాగా..ఈ జూలో ఉండే పైథాన్ పాము జులై 23న ఏడుగ గుడ్లు పెట్టింది. ఇందులో మూడు ఇంక్యుబేటర్‌లో పెట్టారు అధికారులు. రెండింటిని మాత్రం జన్యు నమూనాల కోసం తీసుకున్నారు. మిగతా రెండింటిలో పాము పిల్లలు సజీవంగా లేవని అధికారులు తెలిపారు. జన్యు నమూనా విశ్లేషణ ద్వారా ఆ గుడ్లు లైంగికంగా పునరుత్పత్తి చెందాయా? లేక..అలైంగికంగానా అనే విషయం తెలియనుంది.



https://10tv.in/telugu-tv-actor-sravani-committed-suicide-because-of-a-love-affair-with-both-of-them/
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఫలదీకరణను ఆలస్యం చేయడం కోసం పాములు వీర్యాన్ని శరీరంలోనే నిలువ చేసుకుంటాయట. కాగా..మగతోడు లేకుండా ఏడు గుడ్లు పెట్టిన ఆడ కొండచిలువను దాని యజమాని 1961లో ఈ జూకు అప్పగించాడట.