సముద్రంలో బోటు బోల్తా : 65మంది శరణార్థులు మృతి 

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 05:29 AM IST
సముద్రంలో బోటు బోల్తా : 65మంది శరణార్థులు మృతి 

ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశమైన టునీషియా తీర ప్రాంతంలో ఓ బోటు బోల్తా పడింది. మధ్యధరా సముద్రంలో జరిగిన  ఈ ఘటనలో ఏకంగా 65మంది శ‌ర‌ణార్థులు మృతి చెందారు. ఈ విష‌యాన్ని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్ల‌డించింది.

ఈ క్రమంలో బోటులో ప్ర‌యాణిస్తున్న మ‌రో 16 మందిని ర‌క్షించిన‌ట్లు యూఎన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. లిబియాలోని జువారా నుంచి బోటులో బయలుదేరామని ప్రమాదం నుంచి ప్రాణాలతో బైటపడివారు తెలిపారు.లిబియాలో బయలుదేరిన అనంతరం సముద్రంలో  బ‌ల‌మైన అల‌లు రావ‌డం వ‌ల్ల బోటు బోల్తా బ్యాలెన్స్ తప్పిపోయిందని దీంతో బోల్తా పడిందని తెలిపారు. కాగా బోటు పరిధికి మించి శరణార్ధులు ఎక్కటంతో బోటు గాలులకు తట్టుకోలేక బోల్తా పడిందని అధికారులు భావిస్తున్నారు.

కాగా 2019 సంవత్సరంలోనే మొద‌టి నాలుగు నెల‌ల్లోనే లిబియా నుంచి యూరోప్ మ‌ధ్య ఉన్న జ‌ల‌మార్గంలో సుమారు 164 మంది చ‌నిపోయిన‌ట్లు యూఎన్ సంస్థ వెల్ల‌డించింది.