కరోనా వైరస్ వారికి రెండోసారి సోకదు: సైంటిస్టులు తేల్చేశారు!

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 12:11 PM IST
కరోనా వైరస్ వారికి రెండోసారి సోకదు: సైంటిస్టులు తేల్చేశారు!

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. వందల వేలల్లో కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కనిపించని లక్షణాలతో చాలామంది నుంచి ఈ వైరస్ అంటువ్యాధిలో ఇతరులకు సోకుతుందని అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా ఒకసారి ఒక వ్యక్తికి సోకితే రెండోసారి మళ్లీ సోకదని సైంటిస్టులు తేల్చేశారు. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ఇతరులకు కూడా కరోనా సోకదని నొక్కి చెబుతున్నారు.

కరోనావైరస్ బాధితులు వ్యాధిని అధిగమించిన తరువాత తిరిగి వచ్చినట్టు నమోదైన అనేక కేసుల్లో వాస్తవానికి టెస్టుల వైఫల్యాల కారణంగా జరిగిందని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. South Korean centre for disease control and prevention (CDC)కు చెందిన రీసెర్చర్ల అభిప్రాయం ప్రకారం.. కొవిడ్-19 వైరస్ మానవ శరీరంలోకి రియాక్టివేట్ (తిరగబడదు) కాలేదని అంటున్నారు.

సౌత్ కొరియాలో 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 245 మంది మరణించారు. అంటే.. దేశంలో 2.3 శాతం మరణాల రేటు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన 3.4 శాతం సగటు కంటే తక్కువగానే నమోదైంది. చైనా, జపాన్ దేశాల్లోని కరోనా బాధితులు రెండోసారి కరోనాకు గురైనట్టుగా దక్షిణ కొరియాలో కూడా మొత్తం 227మంది కరోనా బాధితులు మళ్లీ వైరస్ బారనపడతామని నమ్ముతున్నారు.

ఒకసారి వ్యాధి నుంచి కోలుకున్న బాధితుల్లో మళ్లీ వైరస్ సోకేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తి కలిగి ఉండరు. వైరస్ త్వరగా తిరిగి వ్యాపిస్తుందనే ఆందోళనను రేకిత్తిస్తోంది. ఏది ఏమైనా, జన్యుపరమైన విశ్లేషణలో కరోనా వైరస్ ఎలాంటి గణనీయమైన మార్పులను కలిగి ఉన్నట్టు గుర్తించలేదు. వ్యాధి నిరోధక శక్తి నుంచి మర్మంగాదాగి ఉంటుంది.

ఈ రిపోర్టులోని పాక్షిక ఫలితాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది. ఇమ్యూనిటీ పాస్ పోర్టులుగా పిలిచే కరోనాను జయించిన బాధితుల్లో ఎలాగో వైరస్ యాంటీ బాడీస్ ఉంటాయని తిరిగి పనిచేసేందుకు అనుమతి ఇవ్వడాన్ని WHO హెచ్చరిస్తోంది. ఇమ్యూనిటీ పాస్ పోర్టులతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా దేశాల్లో కరోనా లాక్ డౌన్‌లను ఎత్తివేసేలా అనుమతికి ప్రతిపాదించింది.

ఇదివరకే, కొవిడ్-19 ఇన్ఫెక్షన్ (టెస్టు పాజిటివ్ నుంచి నెగటివ్‌కు) అధిగమించిన వారిలో యాంటీ బాడీస్ తయారువుతాయని, తద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని పేర్కొంది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారిలోని యాండీ బాడీస్.. వారిని కరోనా వైరస్ బారిన పడకుండా రక్షిస్తాయని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, యాంటిజెన్ల కోసం రక్తాన్ని చెక్ చేయడానికి ఉపయోగించే polymerase chain reaction (PCR) టెస్టు- వైరస్ వాస్తవ కణాలు కూడా సమస్యలను కలిగి ఉంటాయని ఊహించలేకపోయింది. దక్షిణ కొరియా CDC గుర్తించిన టెస్టు ఫలితాల ప్రకారం.. వైరస్ అనుమానిత వ్యక్తిలో రెండోసారి కరోనా పాజిటివ్ అని తేలడం తప్పుగా పేర్కొంది.

రోగనిరోధక శక్తి సర్టిఫికేషన్‌కు ఉపయోగించే ముందు ఖచ్చితత్వంతో వేగంగా నిర్వహించిన టెస్టులపై ఆధారపడి ఉంటుందని WHO హెచ్చరించింది. ‘పాజిటివ్ టెస్టు ఫలితాన్ని వచ్చిన వారు రెండోసారి వైరస్ వ్యాప్తికి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని భావించే వ్యక్తులు ప్రజారోగ్య సలహాలను విస్మరించవచ్చు’ అని WHO హెచ్చరించింది. HIV చికెన్‌పాక్స్ (chickenpox) వంటి ఇతర వైరస్‌ల మాదిరిగా కాకుండా మానవ కణాల కేంద్రకంలోకి ప్రవేశించి, తిరిగి వ్యాప్తి చేయడానికి ముందు ఏళ్ల తరబడి దాగి ఉండగలదని CDC తెలిపింది.