హెల్త్ ఎమర్జెన్సీని జులై 24వరకు పొడిగించిన ఫ్రాన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 02:03 PM IST
హెల్త్ ఎమర్జెన్సీని జులై 24వరకు పొడిగించిన ఫ్రాన్స్

 కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఈ సమయంలో దేశంలో హెల్త్ ఎమర్జెన్పీని పొడిగిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు నెలలుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఫ్రాన్స్.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని జులై-24వరకు పొడిగిస్తున్నట్లు ఇవాళ(మే-2,2020)ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓలివిర్ వీరన్ ఓ ప్రకటన చేశారు.

మార్చి 24 న ప్రారంభమైన అత్యవసర పరిస్థితిని ఎత్తివేయడం “అకాల” మరియు “వ్యాప్తి చెందే ప్రమాదం” తీవ్రతరం అవుతుందని సోమవారం పార్లమెంటు ముందుకు వెళ్ళే ప్రతిపాదనలో పేర్కొన్కారు. విదేశాల నుంచి ఫ్రాన్స్ కు వచ్చేవాళ్ల క్వారంటైన్ కండీషన్స్ గురించి కూడా ఈ బిల్లులో ప్రస్తావించబడింది. కొంతకాలం పాటు మనం వైరస్ తో జీవించాల్సిన పరిస్థితి అని కేబినెట్ మీటింగ్ తర్వాత ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ క్రిస్టోఫే కాస్టనీర్ అన్నారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకుంటున్నట్లు తెలిపారు.

మే-11నుంచి ఫ్రాన్స్ లో లాక్ డౌన్ నిబంధనలు సడలింపుకు ఆ దేశంకు రెడీ అయింది. మార్చి-17నుంచి ఫ్రాన్స్ లో పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే  మే-11నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వాలని ఆ దేశం నిర్ణయించి. కాగా,ఇప్పటివరకు ఫ్రాన్స్ లో 24,594 కరోనా మరణాలు నమోదయ్యాయి. 167,346 కరోనా కేసులు నమోదయ్యాయి.50,212మంది ఫ్రాన్స్ లో కరోనా నుంచి కోలుకున్నారు.