Taiwan Judo : ఏడేళ్ల బాలుడి ప్రాణం తీసిన జూడో.. 27సార్లు నేలకేసి కొట్టిన కోచ్

తైవాన్‌లో విషాదం చోటుచేసుకుంది. జూడో క్లాస్‌ ఏడేళ్ల బాలుని ప్రాణాం తీసింది. జూడో క్లాస్‌ అంటూ కోచ్‌ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టాడు.

Taiwan Judo : ఏడేళ్ల బాలుడి ప్రాణం తీసిన జూడో.. 27సార్లు నేలకేసి కొట్టిన కోచ్

Taiwan Judo

Taiwan Judo : తైవాన్‌లో విషాదం చోటుచేసుకుంది. జూడో క్లాస్‌ ఏడేళ్ల బాలుని ప్రాణాం తీసింది. జూడో క్లాస్‌ అంటూ కోచ్‌ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టాడు. దీంతో కోమాలోకి వెళ్లాడు. 70 రోజులు కోమాలో ఉ‍న్న ఆ బాలుడికి కొన్ని రోజులుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఉన్నట్టుండి బాలుడి శరీరంలో కొన్ని కీలక అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో తల్లిదండ్రుల అనుమతితో బాలుడిని వెంటిలేటర్‌ పైనుంచి తొలగించారు డాక్టర్లు. కాసేపటికే ప్రాణాలు వదిలాడు.

బాలుడి పేరు హువాంగ్. వయసు ఏడేళ్లు. జూడో నేర్చుకోవడానికి ఏప్రిల్‌ లో హో అనే కోచ్‌ దగ్గర చేరాడు. జూడో బాగా రావాలంటే శారీరకంగా బలంగా ఉండాలని అక్కడికి వచ్చే పిల్లలకు చెబుతూ వారిపై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వేధించేవాడు కోచ్. ఏప్రిల్‌ 21న హువాంగ్‌ను టార్గెట్‌ చేసిన కోచ్‌ హో.. జూడో మూమెంట్స్‌ అంటూ బాలుడిని నేలకేసి కొట్టడం ప్రారంభించాడు. 12సార్లు కిందపడేసిన తర్వాత హువాంగ్‌ తల నొప్పిగా ఉందంటూ వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వదిలేయాలంటూ ఎంత ప్రాధేయపడినా కోచ్‌ కనికరించలేదు. మొత్తంగా 27సార్లు నేలకేసి కొట్టడంతో ఆ బాలుడు సృహతప్పి పడిపోయాడు. దీంతో హువాంగ్‌ ప్రాణాలు పోయాయేమోన్న భయంతో హో అక్కడి నుంచి పారిపోయాడు.

క్లాస్‌లో ఉన్న మిగతా పిల్లలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హువాంగ్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలుడు 72 రోజలు పాటు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. చివరికి చనిపోయాడు. జూడో పేరుతో బాలుడి మృతికి కారణమైన కోచ్ పై పోలీసులు ప‌లు సెక్ష‌న కింద కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.