8 కుక్కలతో 12ఏళ్ల చిన్నారి ‘‘కాంగా డాన్స్’’ గిన్నీస్ రికార్డ్

  • Published By: nagamani ,Published On : June 15, 2020 / 10:22 AM IST
8 కుక్కలతో 12ఏళ్ల చిన్నారి ‘‘కాంగా డాన్స్’’ గిన్నీస్ రికార్డ్

8 కుక్కలతో 12 సంవత్సరాల చిన్నారి చేయించిన విన్యాసానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రసంశలు కురిపించింది. ఎనిమిది కుక్కలతో చక్కగా కో ఆర్డినేట్ చేయించి..తన మాటలతో వాటిని చక్కగా ట్రైన్ చేసి..చేయించిన ‘‘కాంగా డాన్స్’’కు గిన్నీస్ వరల్డ్ రికార్డు వరించింది. 

గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినవారు ఎంతో మంది ఉన్నారు. ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ప్రతిభ వారిదే. అటువంటి మరో చక్కటి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకుంది 12 ఏళ్ల జర్మనీ అమ్మాయి అలెక్సా. ఇంత చిన్న వయస్సులోనే డాగ్ ట్రైనర్ గా మంచి పేరు తెచ్చుకున్న అలెక్సా గిన్నీస్ రికార్డులో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. కేటీ, ఎమ్మా, మాయ, సాలీ, జెన్నిఫర్, సబెరినా, స్పెక్కి,నాలా అనే తన ఎనమిది కుక్కలతో ‘‘కాంగా ’’ చేయించి గిన్నీస్ రికార్డ్ సాధించింది. 

ఇప్పటివరకూ ఇన్ని కుక్కలతో ‘‘కాంగా లైన్’’ చేయించిన మొట్టమొదటి అమ్మాయి అలెక్సా కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి కొంగ అనేది ఒకరకమైన డాన్స్. ఒకరిని మరొకరు పట్టుకుని ఓ రిథమ్ గా చేసే డాన్స్. దీనిని లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువగా చేస్తుంటారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి వెనక మరో వ్యక్తి నిలబడి చైన్ లాగా ఏర్పడి డాన్స్ చేస్తారు. 

ఆ డాన్స్ ను అలెక్సా తన కుక్కలతో చేయించింది. తన దగ్గరున్న కుక్కల్లో ముందుగా సల్లీ అనే కుక్కను ముందు ఉంచింది. సల్లీ వెనక మిగతా కుక్కలన్నీ సైజ్ వారీగా పట్టుకొని నిలబడ్డాయి. ఆ తర్వాత అలెక్సా వెనక్కి నడుస్తూ… కుక్కల్ని తనవైపు నడిపించింది. అన్నీ క్రమశిక్షణగా నడిచాయి. ఈ కుక్కలు మొత్తం 16 అడుగుల 6 అంగుళాల వరకూ లైన్ లో లింక్ తప్పకుండా అలెక్సా సూచనల్ని చక్కగా  పాటిస్తు చేసిన డాన్స్ రికార్డుకు చేరుకుంది. ఎనిమిది కుక్కలతో అలెక్సా చేయించిన ‘‘కాంగా డాన్స్ ’’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.