గుండెలు పిండే విషాదం.. ఫేస్ మాస్కే ఊపిరి.. ఓ చిన్నారి కన్నీటి గాథ

ఇది ఓ చిన్నారి దయనీయ గాథ. కంటతడి పెట్టించే విషాదం. గుండెలను పిండే కష్టం. ఒళ్లంతా కాలిన గాయాలతో ఆ చిన్నారి పడుతున్న నరకయాతన తెలిస్తే కన్నీళ్లు ఆగవు. గాయాలు తీవ్రంగా బాధిస్తున్నా జీవితం మీద ఆశ మాత్రం కోల్పోలేదు. కాలిన గాయాలతో పోరాటం చేస్తూనే ముందుకు వెళ్తోంది. త్రీడీ ఫేస్ మాస్క్ మాటున బతుకు పోరాటం సాగిస్తోంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు మాస్కు ధరించింది.

గుండెలు పిండే విషాదం.. ఫేస్ మాస్కే ఊపిరి.. ఓ చిన్నారి కన్నీటి గాథ

8 Year Old Girl Wears 3d Printed Mask

8-Year-Old Girl Wears 3D-Printed Mask: ఇది ఓ చిన్నారి దయనీయ గాథ. కంటతడి పెట్టించే విషాదం. గుండెలను పిండే కష్టం. ఒళ్లంతా కాలిన గాయాలతో ఆ చిన్నారి పడుతున్న నరకయాతన తెలిస్తే కన్నీళ్లు ఆగవు. గాయాలు తీవ్రంగా బాధిస్తున్నా జీవితం మీద ఆశ మాత్రం కోల్పోలేదు. కాలిన గాయాలతో పోరాటం చేస్తూనే ముందుకు వెళ్తోంది. త్రీడీ ఫేస్ మాస్క్ మాటున బతుకు పోరాటం సాగిస్తోంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు మాస్కు ధరించింది.

ఆ చిన్నారి పేరు మరమ్ అల్ అమవి. వయసు 8ఏళ్లు. గాజాలో ఉంటుంది. గాజా స్ట్రిప్ లో శరణార్థ శిబిరంలో ఉండగా, గ్యాస్ లీక్ అయ్యి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎందరో తీవ్రంగా గాయపడ్డారు. 25మంది సజీవ దహనం అయ్యారు. చాలామందికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. వారి ఒళ్లంతా కాలిపోయింది. అలాంటి బాధితుల్లో మరమ్ కూడా ఉంది.

3d printed mask

మరమ్, ఆమె తల్లి అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ముఖం, చేతుల మీద కాలిన గాయాలు ఉన్నాయి. గుర్తు పట్టలేని విధంగా వారి ముఖాలు కాలిపోయాయి. ప్రస్తుతం వారికి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. కాలిన గాయాలు మానేందుకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఫేస్ మాస్క్ తయారు చేసి వారికి ఇచ్చారు.

ముఖంపై ప్లాస్టర్లు అతికించే బదులుగా ఈ మాస్కు తయారు చేశారు. ఈ మాస్కుని కంప్యూటర్ సాయంతో త్రీ డీ ప్రింట్ చేశారు. ఈ మాస్కుని ప్రత్యేకమైన మందులతో చేశారు. దీన్ని ముఖంపై పెట్టుకుంటే కాలిన గాయాలు త్వరగా నయమవుతాయని డాక్టర్లు తెలిపారు. త్రీడీ ప్రింటెడ్ మాస్కు ముఖంపై ఒత్తిడి పెడుతుంది. తద్వారా కాలిన గాయాలు త్వరగా మానిపోతాయని ఫిజియోదెరపీ హెడ్ ఫిరాస్ వివరిస్తారు. 2020 ఏప్రిల్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. తొలుత జోర్డాన్, హైతీలో ఈ మాస్కులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు గాజా స్ట్రిప్ లో ఉంది.

3d printed mask

గాయాల తీవ్రతను బట్టి ఫేస్ మాస్క్ ని ముఖం మీద ఆరు నుంచి 12 నెలలు ధరించాల్సి ఉంటుంది. ఈ మాస్కు ఎంతో పారదర్శకంగా ఉంటుంది. మరమ్ రోజూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే మాస్కు ధరిస్తుంది. స్కూల్ కి వెళ్లేటప్పుడు దాన్ని తీసేస్తుంది. ఎందుకంటే, స్కూల్లో ఎవరైనా తనను మాస్కులో చూసి నవ్వుతారేమోనని మరమ్ కి భయం.

3d printed mask

”ఈ మాస్కు ధరిస్తున్న తర్వాత బాగుంది. గాయాలు మానుతున్నాయి. అయితే, మాస్కు వేసుకుని బయటకు వెళ్లితే జనాలు నన్ను చూసి నవ్వుతారేమో అని భయంగా ఉంది” అని మరమ్ వాపోయింది. పాలస్తీనియన్ శరణార్థుల కోసం యూనైటెడ్ నేషన్స్ ఓ స్కూల్ నడుపుతోంది. ఆ స్కూల్లో మరమ్ చదువుకుంటోంది.

3d printed mask

మరమ్, రోజూ 8 గంటల పాటు మాస్కు ధరిస్తుంది. మరమ్ తల్లి కూడా ఫేస్ మాస్కు పెట్టుకుంది. ఆమె రోజుకి 16గంటలు మాస్కు ధరించే ఉంటుంది. తినే సమయంలో మాత్రమే మాస్కుని తీస్తుంది. రాత్రి పడుకునే ముందు ఫేస్ మాస్కుతో పాటు చేతికి స్పెషల్ గ్లోవ్స్ ధరిస్తుంది. మాస్కు ధరించిన తర్వాత మాకు బాగుంది. కాలిన గాయాలు క్రమంగా మానుతున్నాయి. మాస్కులు ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలిపింది మరమ్ తల్లి.

3d printed mask

మరమ్, ఆమె తల్లి రెండు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అంతలా వారికి కాలిన గాయాలు అయ్యాయి. ఇప్పుడు కొత్త చర్మం వచ్చింది. ముఖం పూర్తిగా మారిపోయింది. ఈ మార్పుని స్వీకరించాల్సిందే అంటారు వారిద్దరూ. తానిప్పుడు కొంత సౌకర్యవంతంగా ఫీల్ అవుతున్నట్టు మరమ్ తల్లి చెప్పింది.

3d printed mask

ప్రమాదం తర్వాత నా ముఖాన్ని చూసేందుకు నా కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆపరేషన్ జరిగిన 50రోజుల తర్వాత మాస్కు తెచ్చుకునేందుకు క్లినిక్ కి వెళ్లే సమయంలో నేను నా ముఖాన్ని ఎలివేటర్ అద్దంలో చూసుకున్నా అని మరమ్ తల్లి చెప్పింది.

3d printed mask

ఒళ్లంతా కాలిన గాయాలు. ముఖం పూర్తిగా మారిపోయింది. చేతుల నిండా గాయాలే. అవన్నీ బాగా బాధిస్తున్నాయి. అయినా భవిష్యత్తు మీద నమ్మకాన్ని కోల్పోలేదు ఆ తల్లీకూతుళ్లు. రానున్న రెండు మూడేళ్లలో కాలిన గాయాలన్నీ పూర్తిగా మానిపోతాయని, దాని తాలూకు మచ్చలు తొలగిపోతాయని వారు నమ్మకం వ్యక్తం చేశారు.

3d printed mask