Josephine Michaluk : 96 లీటర్లు రక్తాన్ని దానం చేసిన 80 ఏళ్ల బామ్మ .. మానవత్వాన్ని వరించిన గిన్నిస్‌ రికార్డు

80 ఏళ్ల బామ్మ తన జీవితంలో 96లీటర్ల రక్తాన్ని దానం చేశారు. 22 ఏళ్లనుంచి రక్తదానం చేయటం ప్రారంభించి 80 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చేస్తున్న ఈ రక్తదానం మహత్కార్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది.

Josephine Michaluk  : రక్తదానం..ఎంతో అమూల్యమైనదో అంత గొప్పది కూడా. ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం గురించి అవగాహన ఉన్నవారు చాలాసార్లు రక్తదానం చేసి ఉంటారు. కానీ ఓ బామ్మ మాత్రం తన జీవితంలో రక్తదానం చేయటమే పరమావధిగా పెట్టుకున్నారు. 76 ఏళ్లు వచ్చినా రక్తదానం చేయటం మానలేదు. ఆమె ఏ రికార్డులు సాధించటానికో ఈ రక్తదానం చేయట్లేదు. మానత్వంతో తాను చేసిన రక్తదానం ఎంతోమంది ప్రాణాలు కాపాడతాయనే మానవత్వంతో రక్తదానం చేసే పనిని కేవలం మొక్కుబడిగా కాకుండా ఓ అంకితభావంతో కొనసాగించారు కెనడాకు చెందిన జోసఫిన్ మిచలుక్ అనే మహిళ. ఆమెకు 22 ఏళ్లు వచ్చినప్పటినుంచి రక్తదానం చేయటం ప్రారంభించి 76 ఏళ్లు వచ్చినా ఆ మహత్కార్యాన్ని కొనసాగిస్తు వస్తున్నారు జోసఫిన్..

ఆమె మానవత్వానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరించింది. జోసఫిన్ కు 22 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె సోదరితో కలిసి మొదటిసారి రక్తదానం చేయటానికి వెళ్లారు. అప్పుడు తెలిసింది ఆమెకు రక్తదానం విలువ ఏంటో..అంతే అప్పటినుంచి ఈ కార్యక్రమాన్ని కొనగిస్తు వచ్చారు ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ఈనాటికి ఆమె ఆ పవిత్రకార్యాన్ని ఆపలేదు. జోసఫిన్ కు నలుగురు ఆడపిల్లలు. ఆ నలుగురు పిల్లలకు జన్మనిచ్చేక్రమంలో రక్తదానం చేయలేదు. గర్భవతులు రక్తదానం చేయకూడదు. అందుకే ఆమె ఆ సమయంలో రక్తదానం చేయలేదు. అలాగే ఆమె థైరాయిడ్ సమస్యతోను..కొన్ని సర్జరీలు సరిగిన సమయంలోను ఎనిమిదేళ్లపాటు రక్తదానానికి దూరమయ్యారు.

ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న జోసిఫిన్ ఈ 60 ఏళ్లలో ఏకంగా 203 యూనిట్లు (96,019 లీటర్ల ) రక్తాన్ని దానం చేశారు. 2022 సెప్టెంబర్‌ 30న 203వ సారి రక్తదానం చేయటంతో ఆమెను గిన్నిస్ రికార్డు వరించింది.ఇలా ఇన్నిసార్లు రక్తదానం చేయటానికి తన సోదరి కల్గరియే తనకు స్ఫూర్తి అని చెబుతున్నారు జోసిఫర్. మన శరీరంలో రక్తం ఉన్నది ఇతరులకు ఇవ్వడానికేనని నేను భావిస్తాను. మన శరీరంలోని రక్తం ఇతరులు ప్రాణాలు కాపాడుతుంది అంటే అంతకంటే మనకు ఏం కావాలి? అందుకే మన శరీరంలో రక్త ఇతరులకు ఇవ్వటానికేనని అనుకుంటాన్నేను అని తన రక్తదానం గురించి చెప్పుకొచ్చారామె.

ఇతరుల ప్రాణాలు కాపాడుతుందనే ఆలోచనతో నేను ఇంతకాలం రక్తదానం చేశాను తప్ప రికార్డులు ఆశించి కాదని..గుర్తింపు కోసం అంతకన్నా కాదని స్పష్టంచేశారు. నాశరీరంలో ఉన్నది ఇతరులకు ఉపయోగపడతుందంటే ఇక అంతకంటే ఇంకేంకావాలి? నాకు చేతనైన సాయం చేస్తున్నానంతే తప్ప ఇదో గొప్ప ఘనకార్యం అని నేను అనుకోవటంలేదు. ఇది నా బాధ్యతగానే భావిస్తానన్నారు. నేను ఇకపై కూడా రక్తదానం చేయటానికి కొనసాగిస్తానని తెలిపారు ‘0’ పాజిటివ్‌ గ్రూప్ కలిగిన జోసిఫర్.సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తున్న 76ఏళ్ల జోసిఫర్ భారత్ కు చెందిన మధుర అశోక్‌ కుమార్‌ తన జీవిత కాలంలో మొత్తం 117 యూనిట్లు రక్తదానం చేసి నెలకొల్పిన రికార్డును జోసఫిన్‌ బ్రేక్ చేసారు.

ట్రెండింగ్ వార్తలు