Japanese Man: వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక సముద్రంలో తోసేసిన భర్త

81 ఏళ్ల వయసులో భార్యను చంపేశాడు ఒక భర్త. 40 ఏళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఇటీవల జపాన్‌లో జరిగింది.

Japanese Man: వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక సముద్రంలో తోసేసిన భర్త

Japanese Man: జపాన్‌లో ఒక వృద్ధుడు దారుణానికి పాల్పడ్డాడు. 40 ఏళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక ఆమెను సముద్రంలో తోసి, చంపేశాడు. ఈ ఘటన జపాన్, కనాగవా ప్రాంతం, ఒయిసో పట్టణంలో ఇటీవల జరిగింది.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిరోషి ఫుజివారా (81), టెరుకో (79) అనే ఇద్దరూ దంపతులు. వీరికి 50 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అయితే, టెరుకో అనారోగ్యం కారణంగా 40 ఏళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైంది. ఆమె కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడంతో భర్త హిరోషినే 40 ఏళ్లుగా ఆమెను సంరక్షిస్తున్నాడు. ఈ క్రమంలో విసుగెత్తిన హిరోషి.. తన భార్యను సముద్రంలోకి తీసుకెళ్లి, నీళ్లలో తోసేశాడు. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. సముద్రపు నీటిలో ఒక మృతదేహం తేలుతుండటాన్ని కొందరు జాలర్లు గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. వారు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Twitter Blue: దేశంలో మొదలైన ట్విట్టర్ బ్లూ సర్వీస్.. వాళ్లకు మాత్రమే అందుబాటులోకి.. నెలకు ఎంత చెల్లించాలంటే

మరోవైపు ఇదే సమయంలో తన తల్లిని, తండ్రి సముద్రంలో తోసేశాడని వీరి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హిరోషిని అదుపులోకి తీసుకుని విచారించగా, తనే భార్యను సముద్రంలోకి తోసి చంపినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న టెరుకో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంగీకరించారు. హిరోషిని అదుపులోకి తీసుకున్నారు.