సూర్యాస్తమయం చూడాలన్నదే కరోనా రోగి చివరి కోరిక.. నెరవేర్చిన డాక్టర్  

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 06:11 AM IST
సూర్యాస్తమయం చూడాలన్నదే కరోనా రోగి చివరి కోరిక.. నెరవేర్చిన డాక్టర్  

కరోనా వచ్చిన రోగి ఇక హాస్పిటల్ లో బందీ కావాల్సిందే. చైనాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కరోనా వచ్చిందనే అనుమానం వస్తే చాలు వారిని అధికారులబలవంతంగా హాస్పిటల్ కు తరలించేస్తున్నారు. అలా వారికి పరీక్షలు చేసిన తరువాత పాజిటివ్ గా తేలితే వారు ఇక హాస్పిటల్ కు పరిమితం కావాల్సిందే. 

ఇక వారు సూర్యోదయం..సూర్యాస్తమం చూడాలంటే హాస్పిటల్ అద్దాల నుంచి  చూడాల్సిందే. బైటకు రావటానికి లేదు. ఇలా కరోనా వైరస్ సోకిన 87 సంవత్సరాల రోగి గత నెల రోజుల నుంచి యూని హాస్పిటల్ రూమ్ లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి అందమైన సూర్యాస్తమం చూడాలనే కోరికను తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ కు వెల్లడించాడు. నేను ఇంకా ఎంతకాలం బతుకుతానో తెలీదు..పైగా కరోనాతో ఎన్ని రోజులు బతుకి ఉంటానా తెలీదు. కానీ నాకు సూర్యాస్తమయం చూడాలని కోరికగా ఉందని అడిగాడు. 

ఆ వృద్ధుడి కోరిక విన్న ఆ డాక్టర్ కూడా చలించిపోయాడు. కానీ కరోనా సోకినవారిని టెస్ట్ లకు తప్పించి రూమ్ నుంచి బైటకు తీసుకెళ్లకూడదు. కానీ ఆ వృద్ధుడి కోరికను తీర్చాలనుకున్నాడు ఆ డాక్టర్. దీంతో సూర్యాస్తమయం సమయంలో సిటీ స్కాన్ చేయటానికి తీసుకెళుతూ..మధ్యలో సూర్యాస్తమయం కనిపించే స్థలానికి తీసుకెళ్లి చూపించాడు.(ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు)

అది చూసిన ఆ వృద్ధుడు మహదానందం పొందాడు. అతని కళ్లలోని ఆనందాన్ని చూసిన ఆ డాక్టర్ కూడా సంతోషించాడు.తాను కూడా ఆ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు. ఇద్దరూ కలిసి సూర్యాస్తమయాన్ని చక్కగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. 

కాగా..చైనానువణికించి కరోనా వైరస్ 85 దేశాలకు పైగా వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 80వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.వారిలో 33వందల మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.