ప్రజారోగ్యమే భద్రత : సురక్షితమని తేలితే..కరోనా వ్యాక్సిన్, కంపెనీలు సంతకాలు

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 07:03 AM IST
ప్రజారోగ్యమే భద్రత : సురక్షితమని తేలితే..కరోనా వ్యాక్సిన్, కంపెనీలు సంతకాలు

ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆమోదానికి దరఖాస్తు చేయడం జరుగుతుందని కంపెనీలు వెల్లడించాయి.



వ్యాక్సిన్ తొందరగా తయారు చేసేందుకు అడ్డదారులు తొక్కమన్నాయి. ఓ బహిరంగ లేఖపై AstraZeneca, Moderna, Pfizer, Johnson & Johnson, Novavax తదితర సీఈవోలు సంతకాలు చేశాయి. అయితే..ఈ లేఖలో చైనా, రష్యా దేశాలకు చెందిన కంపెనీలు భాగం కాలేదు.
https://10tv.in/do-we-have-enough-soap-children-ask-norway-pm-about-virus/
వ్యాక్సిన్ తయారీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలోనే కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులో తెస్తామని వెల్లడించారు. దీనిని డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్ తప్పుబడుతున్నారు. త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి..కాబట్టే..ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.




ట్రంప్ మాటలను విశ్వసించలేమని డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విమర్శలు గుప్పించారు. అక్టోబర్ కలా..వ్యాక్సిన్ తయారీ సాధ్యం కాకపోవచ్చని అమెరికా అంటువ్యాదుల చికిత్స నిపుణుడు అంటోనీ ఫౌచీ తెలిపారు.

వ్యాక్సిన్ విషయంలో శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇందులో రాజకీయాలకు తావు లేదని అమెరికా, ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు.




అమెరికాలో కరోనా కారణంగా దాదాపు రెండు లక్షల మంది, ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల మంది చనిపోయారు. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ట్రంప్ వెల్లడించారు. అప్పటిలోగా..టీకా రావడం సాధ్యం కాదని NPR, Dr. Moncef Slaoui (chief scientific adviser) తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ అయితే.. వచ్చే ఏడాది జూన్‌ దాకా కరోనా విస్తృత వ్యాక్సినేషన్‌ సాధ్యం కాదని చెబుతోంది.