వీడెట్టా చదివాడ్రా: ప్రపంచంలోనే తొలిసారి 9ఏళ్లకే డిగ్రీ పట్టా

వీడెట్టా చదివాడ్రా: ప్రపంచంలోనే తొలిసారి 9ఏళ్లకే డిగ్రీ పట్టా

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డమ్‌లో తొమ్మిదేళ్ల చిన్నారి ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో గ్రాడ్యుయేట్ పట్టా సాధించాడు. లారెంట్ సిమోన్స్ బ్యాచిలర్ డిగ్రీని ఇందోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(టీయూఈ) నుంచి పొందాడు. డిసెంబరులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నుంచి డిగ్రీ పూర్తి చేయగలిగాడు. బెల్జియంలో పుట్టిన లారెంట్ ఎనిమిదేళ్లకే హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు. 

హైస్కూల్ చదువు పూర్తి అయిన నెలరోజులకే డిగ్రీ పొందాడు. తొమ్మిది నెలల్లోనే చదువు పూర్తి చేయగలిగాడు. ఇంతటితో ఆపకుండా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ కూడా చేయాలనుకుంటున్నాడు. పీహెచ్‌డీ చేస్తూనే మెడిసిన్ లోనూ డిగ్రీ చదువుతానని చెప్తున్నాడు. 

లారెంట్స్‌లోని ప్రత్యేకమైన టాలెంట్ ను ముందుగా అతని తాత, నానమ్మనే గుర్తించారట. ఇక స్కూల్ టీచర్లంతా ఇతణ్ని ఓ గిఫ్ట్ కింద భావిస్తున్నారు. నాలుగేళ్లకు స్కూల్ కు వెళ్లిన లారెంట్స్ 12నెలల్లో ఐదేళ్ల చదువు పూర్తి చేశాడు. లారెంట్ తల్లి మాట్లాడుతూ.. అతను కడుపులో ఉన్నప్పుడు చేపలు ఎక్కువగా తినేదానిని అని చెప్పి జోక్ చేశానని అంటోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Freedom, Dignity & Wealth Are ‘The Bricks’ Of Happiness! We Build! Vote CD&V! #laurentsimons #cdenv #jongcdenv #elections #votesmart #belgium

A post shared by Laurent Simons (@laurent_simons) on