పెద్దాయన గట్టోడే : పెరుగనుకుని పెయింట్ తినేశాడు

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 06:27 AM IST
పెద్దాయన గట్టోడే : పెరుగనుకుని పెయింట్ తినేశాడు

న్యూయార్క్‌ : పెరుగంటే ఆ పెద్దాయనకు ప్రాణం..పెరుగు కనిపిస్తే చాలు ఆగనే ఆగడు..గిన్నెల కొద్దీ తినేస్తాడు.  ఈ ఆత్రంతతో ఆ తాత పెరుగనుకుని పెయింట్ తినేశాడు. అంతేకాకుండా అబ్బా..రోజు తినే పెరుగుకంటే ఇది చాలా బాగుంది..మింట్ ఫ్లేవర్ తో టేస్ట్ అద్దిరిపోయింది అంటే బక్కెట్ లో ఉన్నది పెరుగనుకుని తెలీక సగం తినేశాడు. అంతలో అటుగా వచ్చిన మనుమరాలు చూసి కెవ్వుమంటు అరిచింది. ఏంటలా అరుస్తావ్..అంటు తాత అయోమయంగా..అమాయకంగా చూశాడు. అయ్యో..తాతా ఇది పెరుగు కాదు పెయింట్..ఇంటికోసం తెచ్చింది అని చెప్పేసరికి తాతగారు తెల్లమెహం వేశాడు.. తరువాత షాక్ అయ్యాడు. ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది. 
 

మనవరాలు అలెక్స్ స్టెయిన అరుపు అర్థమైన కాసేపటికి ఆ 90 ఏళ్ల బాబి అనే తాతగారు ఆమె వైపు అమాయకంగా చూశాడు. ‘‘మింట్ ఫ్లావర్‌లో ఉన్న ఈ పెరుగు చాలా టేస్టీగా ఉంది’’ అన్నాడు. కానీ పెయింట్ తిన్నందుకు బాబీ పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అది ఆయనకు బాగా నచ్చేసిందికాబట్టి. తరువాత ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లటం..చిన్నపాటి ట్రీట్ మెంట్ జరగటం తాతగారు ఎప్పటిలాగానే హెల్దీగానే ఉండటం జరిగింది. తరువాత ఈ సంఘటనను అలెక్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. బాబీ తిన్న పెయింట్ డబ్బాను, పెయింట్‌ అంటుకున్న పెదాలతో ఉన్న తన తాత ఫొటోను ట్వీట్ చేసింది. 
 

‘‘మా తాతకు పెరుగంటే చాలా ఇష్టం. అతని కోసం అమ్మ రోజూ వెనిల్లా రుచిలో లభ్యమయ్యే పెరుగును కొని ఇంట్లో ఉంచుతుంది. మా తాత  ఆయన పెయింట్ డబ్బాను చూసి పెరుగనుకుని తినేశాడు. ఇందుకు మా గ్రాండ్ పా (తాత) బాధపడట్లేదు. పెయింట్ తిన్న తర్వాత ఎలాంటి ఇబ్బందికి ఆరోగ్య సమస్యా రాలేదని తెలిపింది. ఈ ఘటనపై బాబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందిస్తూ.. ‘‘ఈ రోజు నేను పెయింట్ తిన్నాను. వాస్తవానికి పెరుగు కంటే పెయింట్ చాలా టేస్టీగా ఉంది అని పోస్ట్ చేశాడు.