Two Variants: కరోనా సోకిన ఐదు రోజులకే చనిపోయింది.. ఒక శరీరంలో రెండు వేరియంట్స్!

ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగి తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు.

10TV Telugu News

Two Coronavirus Variants at once ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగి తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. అయితే, సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గినట్లుగా అనిపిస్తోన్న సమయంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ల గురించి చర్చ కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కరోనాతో మరణించిన ఓ 90ఏళ్ల మహిళ ఒకే సమయంలో కరోనావైరస్ ఆల్ఫా మరియు బీటా వేరియంట్స్‌తో కలిగి ఉండడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.

అసలు కరోనా రెండు వేరియంట్లు ఉండడానికి కారణం ఏంటీ? కరోనా శరీరంలోకి ఎంటర్ అయ్యాక రెండు వేరియంట్లుగా మారిందా? ఐదు రోజుల్లోనే చనిపోయేంత పరిస్థితి రెండు వేరియంట్లు తీసుకుని వచ్చాయ? ఇలా ఎన్నో అనుమానాలు.. బెల్జియంలో పరిశోధకులు చివరకు అసలైన విషయాన్ని కనుగొన్నారు.

ఒంటరిగా నివసించే వృద్ధురాలు చనిపోయిన తర్వాత కూడా పరీక్షలు జరగపగా.. బ్రిటన్లో ఉద్భవించిన ఆల్ఫా జాతి మరియు బీటా వేరియంట్ రెండింటినీ ఆమె శరీరంలో కనుగొన్నారు. అయితే, రెండు వేరియంట్లు కూడా బయటనుంచే ఆమెకు సోకినట్లుగా గుర్తించారు వైద్యులు. ఒకేసారి ఒకే వ్యక్తి నుంచి కాకుండా ఇద్దరు వ్యక్తుల నుంచి కరోనా సోకడంతో రెండు వేరియంట్లు ఆమె శరీరంలోకి ప్రవేశించాయిని, రెండు వేరియంట్లను తట్టుకోలేక ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

ఆమె ఆక్సిజన్ స్థాయిలు మొదట్లో బాగానే ఉన్నా కూడా.. ఆరోగ్యంగా ఉన్న ఆమె పరిస్థితి వేగంగా క్షీణించిందని, అందువల్ల ఐదు రోజుల్లోనే చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే ఆమె వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదని కూడా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ అధ్యయనం ఇంకా శాస్త్రీయంగా ప్రచురించబడలేదు. ఒకటి కంటే ఎక్కువ వేరియంట్లను శరీరం తట్టుకోవడం మాత్రం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు.

10TV Telugu News