91ఏళ్లకు వయస్సులో బామ్మ డ్యాన్స్ అదుర్స్

91ఏళ్లకు వయస్సులో బామ్మ డ్యాన్స్ అదుర్స్

ఎందుకని కదలకుండా ఒకే చోట కూర్చొని వయస్సు పెంచుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు శరీరం కదలకపోయినా మనసు ఆగిపోదు. నాతో నడువు అని లాక్కెళ్తుంది. మనసు మాట వింటే వయస్సుతో పనేముంది. ఇలానే అనుకుంది ఓ 91సంవత్సరాల బామ్మ. ఆదివారాన్ని అద్భుతమైన రోజుగా మార్చేసుకుంది. ఓ ఆదివారం ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను జనవరి 15బుధవారం పోస్టు చేస్తే 1000షేర్లు పోయిందంటే ఆశ్చర్యపడకుండా ఉంటారా..

దానికంటే ముందు అలసు మీరు ఈ వీడియో చూశారా.. 

ఈ వీడియోను గోల్డెన్ ఏజ్ హోమ్ హెల్త్ కేర్ వాళ్లు మిగిలిన వారికి ఇన్‌స్పైరింగ్ గా చూపిస్తున్నారు. పెప్పీ డ్యాన్స్ పాటకు బామ్మ డ్యాన్స్ అదుర్స్ అంటూ పొగిడేస్తున్నారు. 

అసలు ఎవరీమె.. ‘మిస్ జూలియా అనే మహిళ ఇటీవలే గోల్డెన్ ఏజ్ హాస్పిటల్ నుంచి థెరఫీలు చేయించుకుని ఇంటికి వెళ్లింది. ఓ సారి తన డ్యాన్సింగ్ షూకు పనిచెప్పాలనుకుంది. ‘మీరు నాకు మంచి ట్రీట్మెంట్ అందించారు. నాకు డ్యాన్స్ చేయాలనుంది. నేను నా లైఫ్ ను బాగా ఇష్టపడుతున్నాను. నాకు నచ్చిన పాటకు డ్యాన్స్ చేస్తే మీకు ఓకేనా అని అడిగింది’ దానికి వాళ్లు అడ్డు చెప్పలేదు. ఆ తర్వాత ఆమె డ్యాన్స్ చూసి 91ఏళ్ల వయస్సులో మీరుచేసిన డ్యాన్స్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. 

80వేల మందికి పైగా చూసిన వీడియో 1000షేర్లు, 170 కామెంట్లు, 790రియాక్షన్లతో పిచ్చి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ 91ఏళ్ల యంగ్ డ్యాన్స్ చూశారా..