ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి కోసం ప్రొస్తెటిక్ కాళ్ళతో 5 ఏళ్ల బాలుడు 6 మైళ్లు నడిచాడు.. 1.2 మిలియన్లకు పైగా సేకరించాడు!

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 11:03 PM IST
ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి కోసం ప్రొస్తెటిక్ కాళ్ళతో 5 ఏళ్ల బాలుడు 6 మైళ్లు నడిచాడు.. 1.2 మిలియన్లకు పైగా సేకరించాడు!

రెండు ప్రొస్తెటిక్ కాళ్ళతో 5 ఏళ్ల బాలుడు NHS ఆస్పత్రి కోసం 1 మిలియన్ పౌండ్లు ($ 1.2 మిలియన్లు) కంటే ఎక్కువ సేకరించాడు. తాను వారాల వయస్సులో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడిన ఆస్పత్రి కోసం గత నెల నుంచి మొత్తం ఆరు మైళ్ళు నడిచి ఈ మొత్తాన్ని సేకరించాడు. నవజాత శిశువుగా బయోలాజికిల్ పేరంట్స్ కారణంగా Tony Hudgell తన రెండు కాళ్ళను కోల్పోయాడు. అప్పటి నుంచి లండన్ పిల్లల ఆస్పత్రిలోనే తన జీవితాన్ని కొనసాగించాడు. జూన్ అంతటా నడవడం ద్వారా అదే ఆస్పత్రికి ముందుగా 500 పౌండ్లు సేకరించాలని భావించాడు. కానీ, ఆ లక్ష్యాన్ని కొద్ది రోజుల్లోనే చేరుకున్నాడు. తన ఆన్‌లైన్ నిధుల సేకరణ పేజీలో 1.1 మిలియన్ డాలర్లను సేకరించాడు.

టోనీ మంగళవారం తన స్వస్థలమైన ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మల్లింగ్‌లో తన నడకను పూర్తి చేశాడు. తనను దత్తత తీసుకున్న కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. కొన్ని వారాల క్రితమే టోనీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్య కాదన్నారు. కానీ, అతను అంత బలమైన, దృఢమైన బాలుడిగా లక్ష్యాన్ని చేధించడం చూసి చాలా గర్వపడుతున్నామని అతని తల్లి Paula Hudgell తెలిపింది.

టోనీ ఇటీవలే క్రచెస్ మీద నడవడం నేర్చుకున్నాడు. కానీ, బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ కోసం 40 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన తరువాత జాతీయ ప్రముఖుడైన 100 ఏళ్ల యుద్ధ అనుభవజ్ఞుడైన ‘కెప్టెన్ టామ్’ మూర్‌ను చూశాక ఈ ఛాలెంజ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.

డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్, మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ చెల్సియా ఫుట్ బాల్ ఆటగాడు సీజర్ అజ్పిలికుయేటాతో సహా అనేక మంది బ్రిటిష్ ప్రముఖుల నుంచి ఆయనకు మద్దతు లభించింది. సెంట్రల్ లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో భాగమైన ఎవెలినా లండన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం డబ్బును సేకరించాడు. ‘పౌలా మాకు క్రమం తప్పకుండా అప్ డేట్స్ ఇస్తున్నాడు. అతని పురోగతిని చూసి తాము ఆశ్చర్యపోయామని ఆస్పత్రిలో నిధుల సేకరణ అసోసియేట్ డైరెక్టర్ కరోలిన్ గోర్మ్లీ ఒక ప్రకటనలో తెలిపారు.