Hospital Wrong Messages : క్రిస్మస్ శుభాకాంక్షలు బదులు క్యాన్సర్ ఉన్నట్లుగా మెసేజ్.. రోగులకు పంపిన హాస్పిటల్ సిబ్బంది

బ్రిటన్ లో ఓ హాస్పిటల్ పలువురు రోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మెర్రీ క్రిస్మస్ విషెస్ కు బదులుగా క్యాన్సర్ ఉన్నట్లు రోగులకు మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసిన రోగులంతా భయపడ్డారు. క్రిస్మస్ ఈవ్ రోజున యార్క్ షైర్ లోని అస్కర్న్ మెడికల్ ప్రాక్టీస్ నుంచి పలువురు రోగుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు వచ్చాయి.

Hospital Wrong Messages : క్రిస్మస్ శుభాకాంక్షలు బదులు క్యాన్సర్ ఉన్నట్లుగా మెసేజ్.. రోగులకు పంపిన హాస్పిటల్ సిబ్బంది

HOSPITAL

Hospital Wrong Messages : బ్రిటన్ లో ఓ హాస్పిటల్ పలువురు రోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మెర్రీ క్రిస్మస్ విషెస్ కు బదులుగా క్యాన్సర్ ఉన్నట్లు రోగులకు మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసిన రోగులంతా భయపడ్డారు. క్రిస్మస్ ఈవ్ రోజున యార్క్ షైర్ లోని అస్కర్న్ మెడికల్ ప్రాక్టీస్ నుంచి పలువురు రోగుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు వచ్చాయి. వారికి తీవ్ర స్థాయిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టుగా డీఎస్1500 అంటూ ఆ మెసేజ్ లో ఉంది.

ఈ మెసేజ్ చూసి కొందరు రోగులు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు బాధతో విలపించారు. ఇంకొందరు తమ బాధను ఫేస్ బుక్ లో వ్యక్త పరిచారు. మరోవైపు జరిగిన పొరపాటును ఆ హాస్పిటల్ గుర్తించింది. ఆ వెంటనే క్షమాపణలు చెబుతూ మరో మెసేజ్ పంపింది.

Car cleaning saline : సెలైన్ తో కారు క్లీనింగ్..ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

దయచేసి గతంలో పంపిన మెసేజ్ కు హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది. ‘పొరపాటున దీనిని పంపాం. మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అత్యవసర పరిస్థితుల్లో దయచేసి ఎన్ హెచ్ఎస్ 111 నెంబర్ ను సంప్రదించండి’ అని ఆ మెసేజ్ లో పేర్కొంది.