Atlantic Fire : మహా సముద్రంలో మంటలు.. తగలబడిపోయిన లగ్జరీ కార్లు

మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల వైశాల్యంతో ఉన్న ది ఫెలిసిటీ ఏస్ షిప్‌లో కెనడాకు పంపించాలని భావించినా.. మధ్యలో ప్రమాదం జరగడంతో... భారీ నష్టం జరిగినట్లు వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు..

Atlantic Fire : మహా సముద్రంలో మంటలు.. తగలబడిపోయిన లగ్జరీ కార్లు

Burning Cars

Cargo Ship Full Of Luxury Cars : అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ కార్లు నీళ్లపాలయ్యాయి. జర్మనీ ఎండెన్ నుంచి అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని డేవిస్‌విల్లే పోర్టుకు విలాసవంతమైన కార్లను తీసుకెళ్తున్న భారీ నౌక పొర్చోగల్‌లోని అజోర్స్ దీవుల సమీపంలో అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. షిప్‌లోని కార్లనీ తగలబడిపోయాయి. కార్గొ షిప్‌లో మంటల్లో చిక్కుకున్న ఒక్కో కారు కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. వివిధ దేశాల్లోని షోరూమ్‌లకు తరలించేందుకు గాను.. ది ఫెలిసిటీ ఏస్‌లోకి కార్లను ఎక్కించారు. 11వందలకు పైగా లంబోర్గిని కార్లుండగా.. మిగతావి పోర్షే, ఆడి కార్లున్నాయి. బుధవారం జర్మనీ నుంచి షిప్ స్టార్ట్ అవగా.. గురువారం రాత్రి సమయంలో అజోర్స్ దీవుల సమీపంలో నౌకలో మంటలు చెలరేగాయి.

Read More : Elon Musk : 7 నిమిషాల్లో ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్.. సీన్ కట్ చేస్తే

ప్రమాదం జరిగిన వెంటనే.. రంగంలోకి దిగిన పోర్చుగీస్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ టీమ్‌లు రెస్కూ ఆపరేషన్ ప్రారంభించాయి. హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టి.. 22మంది సిబ్బందిని కాపాడారు. వారిని 170 కిలోమీటర్ల దూరంలో మరో దీవికి తీసుకెళ్లారు. కానీ.. కార్లతో మంటల్లో ఉన్న షిప్‌ను ఒడ్డుకు చేర్చలేకపోయారు. కళ్లముందే కోట్ల విలువ చేసే కార్లు తగులబడుతున్నా.. రెస్క్యూ టీమ్ ఏమీ చేయలేకపోయింది. జర్మనీలో వోక్స్ వ్యాగన్ గ్రూప్ లగ్జరీ కార్లను తయారు చేస్తోంది. లంబోర్గిని, పోర్షె, ఆడి లాంటి కార్లను వోక్స్ వ్యాగన్ గ్రూప్ తయారు చేస్తోంది.

Read More : Singapore PM fLee Hsien :నెహ్రూపై సింగపూర్‌ ప్రధాని ప్రశంసలు..భారత ఎంపీల నేరచరిత్రలపై..సంచలన వ్యాఖ్యలు

మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల వైశాల్యంతో ఉన్న ది ఫెలిసిటీ ఏస్ షిప్‌లో కెనడాకు పంపించాలని భావించినా.. మధ్యలో ప్రమాదం జరగడంతో… భారీ నష్టం జరిగినట్లు వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని రెస్క్యూ టీమ్ చెబుతోంది. మరోవైపు.. ఈ ఘటనపై సంస్థ ప్రతినిధులు స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సిబ్బందిని రక్షించడంపైనే దృష్టిపెట్టినట్లు వివరించారు. అయితే.. షిప్‌లో మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక.. కార్గొ షిప్‌ను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని… ఇప్పటివరకైతే.. నౌకనుంచి ఎలాంటి పర్యావణ హాని కలగలేదని చెబుతున్నారు.