Dismissal of employees: 10వేల మంది ఉద్యోగులను తొలగించిన చైనా కంపెనీ

ప్రపంచంలోనే అతిపెద్ద ఇ- కామర్స్ దిగ్గజం చైనాకు చెందిన అలీబాబా (Alibaba) కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను తొలగించింది..

Dismissal of employees: 10వేల మంది ఉద్యోగులను తొలగించిన చైనా కంపెనీ

Dismissal of employees: ప్రపంచంలోనే అతిపెద్ద ఇ- కామర్స్ దిగ్గజం చైనాకు చెందిన అలీబాబా (Alibaba) కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులను తొలగించింది. చైనాలో ఆర్థికవృద్ధి మందగించడం, విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నంలో దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు శనివారం కంపెనీ స్పష్టం చేసింది.

CM KCR Comments : దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నాయి

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. జూన్ త్రైమాసికంలో 9,241 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కంపెనీ తొలగించింది. తద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్యను 245,700కి తగ్గించుకుంది. 2016 మార్చి తరువాత తొలిసారి ఈ కంపెనీ ఉద్యోగులను తొలగించింది. జూన్ త్రైమాసికంలో నికర ఆదాయం 50% తగ్గి 22.74 బిలియన్ యువాన్లకు జరిపింది. గత ఏడాది ఇదే కాలంలో 45.14 బిలియన్ యువాన్ల నుండి తగ్గింది.

Taiwan Vs China : తైవాన్‎‎‌పై క్షిపణులతో దాడికి దిగిన చైనా

ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్ అయిన చైనాలో నిరంతర నియంత్రణ ఒత్తిడి, నిదానమైన వినియోగం, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొంటున్నందున ఖర్చును తగ్గించుకోవటానికి అలీబాబా గ్రూప్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.