Reincarnation : మరణించిన వ్యక్తికి మళ్లీ ప్రాణం..!

చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? అయితే ఇది సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, దీన్ని నిజం చేసి చూపిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫిక్షన్‌ కాదు.. సైన్స్‌ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపిస్తామంటున్నారు.

Reincarnation : మరణించిన వ్యక్తికి మళ్లీ ప్రాణం..!

reincarnation

Reincarnation : మరణించిన వ్యక్తి మళ్లీ బతకడం అసాధ్యం. సినిమాలో అయితే సాధ్యమవుతుంది.. నిజ జీవితంలో సాధ్యం కాదు. కానీ చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? అయితే ఇది సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, దీన్ని నిజం చేసి చూపిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫిక్షన్‌ కాదు.. సైన్స్‌ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపిస్తామంటున్నారు. అయితే, ఇప్పుడు కాదు.. భవిష్యత్తులో! భవిష్యత్తు టెక్నాలజీపై ఉన్న భరోసాతో కొందరు శరీరాలను ‘క్రయోనిక్స్‌’ పద్ధతిలో భద్రంగా ఉంచుతున్నారు. ఆ కోవలోకి దాదాపు 500 మంది చేరారు.

ఇలా శరీరాలను భద్రపరిచే కంపెనీ కూడా ఉన్నదంటే నమ్ముతారా? అమెరికాలోని అరిజోనాలో ఉన్న అల్కర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ ఫెసిలిటీ.. శరీరాలను దశాబ్దాల తరబడి పాడవకుండా కాపాడుతుంది. ఈ కంపెనీ వద్ద 199 మనిషి శరీరాలు, 100 పెంపుడు జంతువుల శరీరాలు భద్రంగా ఉన్నాయి. మొత్తం శరీరాన్ని భద్ర పర్చాలంటే రూ. కోటిన్నర, కేవలం మెదడును భద్రపర్చాలంటే రూ.65 లక్షలు వసూలు చేస్తున్నామని అల్కర్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Tadepalle Manipal Hospitals : 8ఏళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి.. అరుదైన ఆపరేషన్ చేసిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు

మనిషి చనిపోయాడని చట్టబద్ధంగా నిర్ధారించిన మరుక్షణమే వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని, ఇతర ద్రవ పదార్థాలను తొలగించి, రసాయనాలతో నింపుతారు. పెద్ద స్టీల్‌ ట్యాంకుల్లో ద్రవరూప నైట్రోజన్‌ను నింపి అందులో శరీరాన్ని భద్రపరుస్తారు. ఈ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత -196 డిగ్రీలు ఉంటుంది. దీనివల్ల శరీర కణజాలాలు, ఇతర అవయవాలు పాడుకాకుండా ఉంటాయి. ఈ ప్రక్రియనే క్రయోనిక్స్‌ అంటారు.

గుండె కొట్టుకోవటం ఆగిపోగానే మరణ ప్రక్రియ పూర్తి కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలోని కణజాలాలు, కండరాలు, అవయవాలు అచేతనంగా మారటానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. అవి అచేతనంగా మారకముందే గడ్డకట్టిస్తామని పేర్కొన్నారు. అయితే, పునర్జన్మ ప్రసాదించటంపై మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేక పోతున్నారు.

Pollock Sisters Mystery : కారు ప్రమాదంలో చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టిన అక్కచెల్లెళ్లు..

ప్రస్తుతానికైతే శరీరాన్ని భద్రపర్చగలమని, గుండెను పనిచేయించే టెక్నాలజీ ఇప్పుడు లేదని అంటున్నారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకొనేలా చేయగలుగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనుక సక్సెస్ అయితే ప్రపంచంలో ఇంతకన్నా అద్భుతం మరోటి ఉండదు.