Dog In Luggage : లగేజ్ బ్యాగ్ లో కుక్కను తీసుకెళ్లిన ప్రయాణికుడు.. షాకైన ఎయిర్ పోర్టు సిబ్బంది

అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్ ను లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణికుడి లగేజ్ లో కుక్క కనిపించింది.

Dog In Luggage : లగేజ్ బ్యాగ్ లో కుక్కను తీసుకెళ్లిన ప్రయాణికుడు.. షాకైన ఎయిర్ పోర్టు సిబ్బంది

passenger luggage dog

Dog In Luggage : అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్ ను లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణికుడి లగేజ్ లో కుక్క కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. విస్కాన్ సిన్ నగరంలోని డేన్ కంట్రీ రీజనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్ పోర్టు సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి సంబంధించిన కాలేజీ బ్యాగ్ ను ఎక్స్ రే మెషీన్ లోకి పంపగా అందులో గుర్తుపట్టలేని వస్తువును గుర్తించారు. బ్యాగ్ ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. దీన్ని చూసి సిబ్బంది షాక్ అయ్యారు.

#ShameOnIndiGo : ప్రయాణికులందరి లగేజీ మరిచి దేశం దాటిన ఇండిగో

ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అయింది.