Honeymoon: హనీమూన్‌ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి

పిల్లలు లేని దంపతులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి మాతృ స్పర్శ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక తమ పిల్లలకు తమ ఆస్తులను అవసరమైతే తమ శరీర భాగాలను ఇచ్చే తల్లిదండ్రులు సమాజంలో కోకొల్లలు. అయితే ఓ తండ్రి మాత్రం హామిమూన్ కోసం కొడుకునే అమ్ముకున్నాడు.

Honeymoon: హనీమూన్‌ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి

Honeymoon (2)

Honeymoon: పిల్లలు లేని దంపతులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి మాతృ స్పర్శ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక తమ పిల్లలకు తమ ఆస్తులను అవసరమైతే తమ శరీర భాగాలను ఇచ్చే తల్లిదండ్రులు సమాజంలో కోకొల్లలు. అయితే ఓ తండ్రి మాత్రం హామిమూన్ కోసం కొడుకునే అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో భార్యతో కలిసి హనీమూన్ కి వెళ్ళాడు. కొడుకును అమ్మిన విషయం పోలీసులకు తెలియడంతో కటకటాల పాలయ్యాడు.. కాగా ఈ ఘటన చైనాలో జరిగింది.

చైనా జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. అయితే భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ.. పాప తల్లి దగ్గర ఉండాలని, కొడుకు తండ్రి దగ్గర ఉండాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం చెరొకరిని తీసుకోని విడిగా ఉంటున్నారు. ఈ సమయంలోనే తన వద్ద ఉన్న కుమారున్ని
వృద్ధ తల్లిండ్రుల వద్ద వదిలి ఉద్యోగానికి వెళ్ళాడు. కొద్దీ రోజుల తర్వాత అక్కడ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన బాబు విషయం రెండో భార్యకు చెప్పాడు.

బాబును తీసుకోని మనతోనే ఉంచుకుందాం అని చెప్పాడు కానీ అతడి భార్య దానికి నిరాకరించింది. బిడ్డ ఎప్పటికైనా అడ్డమే అని భావించిన సదరు వ్యక్తి. తల్లిదండ్రుల వద్దకు వచ్చి బాబు తనతో పంపితే తన భార్యకు చూపించి తిరిగి తీసుకొస్తానని చెప్పి బాబును తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాబును 1,58,000 యువాన్లకు (రూ.18,00,000) అమ్మాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్‌ చేయసాగాడు. ఇక బాబును తల్లి దగ్గరికి తీసుకెళ్లి వారం రోజుల పైనే అవుతుంది. ఇంకా తిరిగి తీసుకురాకపోవడంతో.. బాబు తండ్రికి కాల్‌ చేశారు అతడి కుటుంబ సభ్యులు.

ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వారు తమ మొదటి కోడలికి ఫోన్ చేసి మనవడి గురించి అడిగారు. తన వద్దకు తీసుకురాలేదని సమాధానం ఇవ్వడంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హామిమూన్ కు వెళ్లిన జంట వచ్చేవరకు వెయిట్ చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని విచారణ చెయ్యగా బాబును అమ్మినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి, కోర్టు తీర్పు మేరకు జైలుకు తరలించారు. కాగా చైనా దేశంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతూనే ఉంటాయి.