Rental Balcony: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. బాల్కనీ అద్దెకిస్తున్న యువకుడు

అవకాశాలను అందిపుచ్చుకుంటే సాధించలేనిది ఏమీలేదని పెద్దలు ఊరికే చెప్పలేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని సామెతలు ఊరికే పుట్టలేదు. ఈ స్టోరీ చదివితే అవును అవన్నీ నిజమే అనిపిస్తుంది.

Rental Balcony: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. బాల్కనీ అద్దెకిస్తున్న యువకుడు

Rental Balcony

Rental Balcony: అవకాశాలను అందిపుచ్చుకుంటే సాధించలేనిది ఏమీలేదని పెద్దలు ఊరికే చెప్పలేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని సామెతలు ఊరికే పుట్టలేదు. ఈ స్టోరీ చదివితే అవును అవన్నీ నిజమే అనిపిస్తుంది. సహజంగా ఇల్లు, అపార్ట్మెంట్, లేదంటే కనీసం ఇంట్లో ఓ గది అద్దెకిచ్చిన వాళ్ళని ఇప్పటి వరకు మనం చూశాం. కానీ ఇంటి బాల్కనీని.. అది కూడా గంటల చొప్పున అద్దెకిచ్చిన వాళ్ళని ఇప్పుడే మనం చూస్తున్నాం.

టొరంటోలో నివాసముంటున్న 24ఏళ్ల ర్యాన్​ అల్రుషుద్​ ఓ అపార్ట్​మెంట్​లోని 60వ అంతస్తులో నివాసముంటున్నాడు. తన ఇంటి బాల్కనీ నుండి నగరం మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో తన అపార్ట్​మెంట్​ బాల్కనీని అద్దెకు పెట్టేశాడు​. సహజంగానే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అందమైన ఫోటోల కోసం నెటిజన్లు వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ అద్దె బాల్కనీకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ర్యాన్​ బాల్కనీని ఉపయోగించుకుని నెటిజన్లు అద్భుతమైన ఫొటోలు దిగుతుండగా.. అవి సామాజిక మాధ్యమాల్లో మంచి లైక్స్​ తెచ్చిపెడుతున్నాయి.

ఒకరకంగా ఫొటో ప్రేమికులకు ఇది ఇప్పుడు హాట్​స్పాట్​గా మారిపోయింది. తన బాల్కనీలో ఫొటోలు దిగేందుకు, మోడల్స్​కు ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లను అందుబాటులో ఉంచిన ర్యాన్.​. మనిషికి గంటకు 25డాలర్లు చొప్పున వసూలు చేస్తున్నాడు. బాల్కనీని అద్దెకు తీసుకున్న వారికి బాత్​రూం, వైఫై​ అదనంగా ఇస్తున్న ర్యాన్ ఒక్కసారి కేవలం ముగ్గురికే అనుమతి ఇస్తున్నాడు. స్వతహాగా ఫోటో గ్రాఫర్ అయిన ర్యాన్.. గతంలో ఫోటో స్టూడియోలకు బోలెడు డబ్బులు తగలేసి.. ఇప్పుడు అలా మంచి ఫోటోలను కోరుకొనే వారి దగ్గర నుండే తిరిగి ఆ డబ్బు రాబట్టుకుంటున్నాడు.