Earthquake : నేపాల్‌ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత

నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదు అయింది.

Earthquake : నేపాల్‌ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత

Earthquake

earthquake : నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం (జులై31,2022) ఉదయం 7.58 గంటలకు ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదు అయింది.

ఖాట్మాండుకు 170 కిలోమీటర్ల దూరంలోని ధిటుంగ్‌ వద్ద భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

Massive Earthquake : దక్షిణ ఇరాన్‌లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!

నేపాల్‌ సరిహద్దుల్లోని బీహార్‌కు చెందిన సీతామర్హి, ముజఫర్‌పూర్‌, భాగల్పూర్‌, అరారియా, సమస్తిపూర్‌లో కూడా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల సమయంలో స్వల్పంగా భూ ప్రకంపణలు వచ్చాయని చెప్పారు.