Afghanistan Exports : అఫ్ఘానిస్తాన్.. భారత్‌కు ఎగుమతి చేసిన వస్తువుల జాబితా

అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల అరాచకాలు, దురాఘతాలకు అంతే లేదు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

Afghanistan Exports : అఫ్ఘానిస్తాన్.. భారత్‌కు ఎగుమతి చేసిన వస్తువుల జాబితా

Afghanistan Exports

Afghanistan Exports : అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల అరాచకాలు, దురాఘతాలకు అంతే లేదు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. చాలామంది దేశం విడిచి పారిపోతున్నారు. తాలిబన్ల రాకతో అప్ఘానిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అప్ఘానిస్తాన్ నుంచి భారత్ అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది వాటి విలువ 509 మిలియన్ డాలర్లు. ఇంతకీ అప్ఘానిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఐటెమ్స్ ఏంటంటే…

అఫ్ఘానిస్తాన్‌లో వ్యవసాయం, పశుపోషణ, ప్రధానంగా జీవనాధార వ్యవసాయం, పశుసంవర్ధక సంచారంతో కూడినవి. స్థూల జాతీయోత్పత్తి (GDP)లో అత్యంత ముఖ్యమైన అంశాలు. దాని మొత్తం విలువలో దాదాపు సగం.

అఫ్ఘాన్ సంప్రదాయ ఎగుమతులు..
* ఎండిన పండ్లు
* గింజలు
* తివాచీలు
* కరాకుల్ పెల్ట్‌

దిగుమతులు..
* వాహనాలు
* పెట్రోలియం ఉత్పత్తులు
* చక్కెర
* వస్త్రాలు
* ప్రాసెస్ చేయబడిన జంతువులు
* కూరగాయల
* నూనెలు
* టీ

అఫ్ఘానిస్తాన్‌లో ఎగుమతులు GDP లో దాదాపు 20 శాతం ఉన్నాయి.

అఫ్ఘానిస్తాన్ ప్రధాన ఎగుమతి భాగస్వాములు..
పాకిస్తాన్ (మొత్తం ఎగుమతులలో 48 శాతం)
* ఇండియా (19 శాతం)
* రష్యా (9 శాతం)
* ఇరాన్, ఇరాక్, టర్కీ.

భారత్, అఫ్ఘానిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యం..
* భారత్, అఫ్ఘానిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2020-21లో 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
* 2019-20లో 1.52 బిలియన్ డాలర్లు.

అఫ్ఘానిస్తాన్ నుండి భారత్ దిగుమతి చేసుకున్న వస్తువులు..
* ఎండుద్రాక్ష
* వాల్‌నట్
* బాదం
* పైన్ నట్
* పిస్తా
* ఎండిన నేరేడు
* ఫిగ్(అత్తి)

తాజా పండ్లు..
ఎండిన పండ్లు మాత్రమే కాదు తాజా బెర్రీలు, చెర్రీ, పుచ్చకాయ, ఔషధ మూలికలు అఫ్ఘానిస్తాన్ కు భారత్ ఎగుమతి చేస్తుంది.