Big reward Finding Killer : ఐదేళ్ల క్రితం దంపతుల హత్య.. హంతకుడి ఆచూకీ తెలిపితే రూ.212 కోట్లు
కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు.

Big reward Finding Killer : కెనాడాలో ఓ హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. తన తల్లిదండ్రులను హత్య చేసిన హంతకుడిని పట్టిస్తే రూ.212 కోట్లు ఇస్తానని భారీ రివార్డు ప్రకటించాడు. కెనాడాకు చెందిన అపోటెక్స్ అనే ఫార్మా కంపెనీ అధినేత బార్రీ షెర్మన్, అతడి భార్య హనీ ఐదేళ్ల క్రితం హత్య గావించబడ్డారు.
ఇంటి ఆవరణలోని స్విమ్మింగ్ పూల్ రెయిలింగ్ కు బెల్టులతో ఉరివేసి దంపతులను హత్య చేశారు. అయితే ఐదేళ్లు గడిచినా హత్య చేసిన వారిని పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో తన తల్లిదండ్రులను హత్య చేసిన వారిని పట్టుకునేందుకు వారి కుమారుడు జొనాథన్ షెర్మన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అందులో భాగంగా హంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.212 కోట్లు ఇస్తానని భారీ నజరానా ప్రకటించారు. తల్లిదండ్రుల హత్య తనను ఐదేళ్లుగా వేధిస్తోందని జొనాథన్ షెర్మన్ పేర్కొన్నారు. ఈ బాధ నుంచి బయటపడాలంటే తన తల్లిదండ్రులను చంపిన వారికి శిక్ష పడాలని చెప్పారు.