Plane Wheel Man Body : విమాన చక్రం వద్ద మనిషి మృతదేహం

లండన్ గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ కు గురయ్యారు.

Plane Wheel Man Body : విమాన చక్రం వద్ద మనిషి మృతదేహం

man body

plane wheel man body  : లండన్ గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ కు గురయ్యారు. గాండియాకు చెందిన టీయూఐ ఎయిర్ వేస్ విమానం ఈ నెల 5వ తేదీన బంజుల్ నుంచి టేకాఫ్ అయింది.

లండన్ లోని గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే ఆ విమాన చక్రం వద్ద ఒక నల్లజాతీయుడి మృతదేహం ఉండటాన్ని విమానాశ్రయ సిబ్బంది గమనించారు. ఈ విషయాన్ని బ్రిటన్ లోని ససెక్స్ మెట్రోపాలిటన్ పోలీసులు గాండియా ప్రభుత్వానికి తెలిపారు. ఈ సంఘటనపై గాంబియా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Plane Crashed Power Lines : అమెరికాలో విమాన ప్రమాదం.. విద్యుత్‌ తీగలపై కుప్పకూలిన ఫ్లైట్

విమాన చక్రం వద్ద మరణించి ఉన్న నల్లజాతీయుడి పేరు, వయస్సు, జాతీయత, ప్రయాణ చరిత్రకు సంబంధించిన వివరాలు, తమ దేశీయుడా కాదా అన్నది తెలియదని పేర్కొంది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు బ్రిటన్ పోలీసులు మృతదేహానికి డీఎన్ ఏ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు ఆఫ్రియా దేశాల నుంచి ఐరోపాకు అక్రమంగా వలస వెళ్లేందుకు కొందరు వ్యక్తులు విమాన చక్రాల వద్ద దాక్కుని దొంగచాటుగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మృతి చెందారు. అయితే గతంలో కూడా ఇలంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.