‘super’ Earth : అక్కడ ప్రతీ రెండున్నర రోజులకు ఒక కొత్త సంవత్సరం..!!

‘super’ Earth : అక్కడ ప్రతీ రెండున్నర  రోజులకు ఒక కొత్త సంవత్సరం..!!

‘super’ Earth..

‘super’ Earth only takes 2.4 days to complete a year : సౌరకుటుంబం లోని గ్రహాల్లో మనంతో పాటు పలు కోట్ల జీవరాశులు నివసించే భూమి కూడా ఒకటి. తన చుట్టూ తానుతిరుగుతూ సూర్యుడి భూమి తిరుగుతుంటుంది. దీంతో పగలు-రాత్రి ఏర్పడతాయి. భూమి తన చుట్టు తాను తిరిగే కాలం దాదాపు 24 గంటలు అంటే మనకు ఒకరోజు. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగటానికి పట్టే సమయం దాదాపు 365 రోజులు. అంటే మనకు ఒక సంవత్సరం. దీన్నే భూభ్రమణం అంటారనే విషయం తెలిసిందే. అలా మనకు 365 రోజులకు ఒక కొత్త సంవత్సరం (New year) వస్తుంది. కానీ కేవలం రెండున్నర రోజులకే కొత్త సంవత్సరం వస్తుందనే విషయం మీకు తెలుసా? ఏంటీ కేవలం రెండున్నర రోజులకు కొత్త సంవత్సరమా?!!అని కచ్చితంగా షాక్ అవుతారు. ఇదేదో ఫేక్ అనుకుంటారు.

1

ఖగోళం గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువ. అనంతమైన విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు దాగి ఉన్నాయి. మనిషి ఛేదించింది కేవలం నామ మాత్రమే. సైంటిస్టులు తమ పరిశోధనలతో ఎప్పటికప్పుడు కొత్త వింతలు..విశేషాలు వెలుగులోకి తెస్తూనే ఉంటారు. రహస్యాలను ఛేదించటానికి నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. అటువంటిదే మరో షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. అదే ‘‘సూపర్ ఎర్త్’’ (‘super’ Earth). ఈ సూపర్ ఎర్త్ తెలుసుకోవాల్సిందే…

2

కెనరీ ద్వీప సముదాయంలోని ఆస్ట్రోఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తాజాగా భూమిని పోలీన ఓ భారీ గ్రహాన్ని గుర్తించారు. ఆ భారీ గ్రహం మన భూమి కంటే దాదాపు 3.5 రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగి ఉంది. ఈ గ్రహం పేరు జీజే740. భూమికి 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెడ్‌ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ ఈ భారీ గ్రహం పరిభ్రమిస్తోంది. భూమి కాలమానం ప్రకారం… జీజే 740 (GJ 740)కేవలం 2.4 రోజుల్లోనే ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది! అంటే.. ఆ గ్రహంపై దాదాపు ‘‘రెండున్నర రోజులకోసారి కొత్త సంవత్సరం’’ వస్తుందన్న మాట.

9

మానవుడికి నివాస యోగ్యమైన గ్రహాలు ఏమైనా ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిరంతరం అన్వేషిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీజే 740 గురించి వెలుగులోకి తీసుకొచ్చారు సైంటిస్టులు. మానవాళికి తెలియజేశారు. అంతదూరంలో ఉన్న గ్రహంపై మానవుడు కాలు పెట్టడం ఇప్పుడప్పుడే సాధ్యపడకపోయనప్పటికీ దీన్ని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూమి పుట్టుకకు సంబంధించి అనేక రహస్యాలను ఛేదించేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు.