Turkey, Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. వేలాది భవనాలు నేల మట్టం, 3600లకు చేరిన మృతుల సంఖ్య

ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది.

Turkey, Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. వేలాది భవనాలు నేల మట్టం, 3600లకు చేరిన మృతుల సంఖ్య

Earthquake

Turkey, Syria Earthquakes : ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రకు వేలాది భవనాలు నేల మట్టమయ్యాయి. అనేక నగరాలు మరు భూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 3,600లకు పైగా మంది మృత్యువాతపడగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు టర్కీలో దశల వారి భూప్రకంపనలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు.

టర్కీ, సిరియాలో ఎటు చూసిన కూలి పోయిన బిల్డింగుల్లే దర్శనమిస్తున్నాయి. రెండు దేశాల్లోని ప్రాంతాలు శవాల దిబ్బగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు టర్కీలో 2,316 మంది మరణించగా, సిరియాలో 1293 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. మొత్తంగా ఇప్పటివరకు రెండు దేశాల్లో 3,600లకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. శిథిలాలు తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, 10 వేలు దాట వచ్చని యూఎన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

టర్కీ, సిరియా సరిహద్దుల్లో నిన్న వరుస పెట్టి మూడు టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. 3,600లకు చేరిన మృతుల భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి నగరాల్లోని పలు అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వేలాది మంది జనం చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగతుున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. భూకంపాల్లో వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలోని పది నగరాలపై భూకంప ప్రభావం పడింది.

ఎక్కడికక్కడ భవనాలు, అపార్ట్ మెంట్లు కుప్పకూలి పోయాయి. టర్కీలో వరుసగా వస్తున్న ప్రకంపనాలతో ఇళ్లలోకి వెళ్లడానికి జనం భయపడుతున్నారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ వీధుల్లోనే వెల్లదీస్తున్నారు. టర్కీ, సిరియా ప్రపంచదేశాల సాయం కోరుతున్నాయి. టర్కీలోని దియాబకీదు, సిరియాలోని అలెక్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి.  7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తివంతమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Turkey Earthquake : టర్కీలో మళ్లీ భారీ భూకంపం.. గంటల వ్యవధిలో రెండోసారి

దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఈ విలయం చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టర్కీలో మొత్తం పది ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా 3 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇకపోతే సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, ప్రబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కలిపి 1200 మందికిపైగా మరణించినట్లు సమాచారం.

వందలాది మంది గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్తు ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.