Strange Creature : ఏలియ‌న్‌ను పోలిన వింత జీవి

వింత జీవి ఫొటో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ జీవిని కొంత‌మంది నిపుణులు గుర్తించ‌గ‌లిగారు. దీని పేరు గూస్ బార్నాకిల్స్ లేదా గూస్‌నెక్ బార్నాకిల్స్ అంటార‌ని పేర్కొన్నారు. ఇవి అరుదైనవేకాక‌ రుచికరమైనవ‌ని తెలిపారు.

Strange Creature : ఏలియ‌న్‌ను పోలిన వింత జీవి

Strange Creature

strange creature : బీచ్‌ల‌లో కొత్త వ‌స్తువులు, జంతువులు క‌నిపిస్తుంటాయి. వీటిలో కొన్ని మాత్రం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తాయి. వింతైన స‌ముద్ర జాతులు క‌నిపిస్తుంటాయి. యూకేలోని వేల్స్ బెన్నార్ బీచ్‌లో వింత జీవి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇది ఏలియ‌న్‌ను పోలి ఉండ‌డంతో ఈ ఫొటో నెట్టింట వైర‌ల్‌ అయింది. ఈ వింత‌ జీవిని షెల్ లాంగ్‌మోర్ అనే మ‌హిళ గుర్తించారు. ఆ జీవి పేరేంటో తెలియ‌కపోవ‌డంతో దాన్ని ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వింత జీవి ఫొటో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ జీవిని కొంత‌మంది నిపుణులు గుర్తించ‌గ‌లిగారు. దీని పేరు గూస్ బార్నాకిల్స్ లేదా గూస్‌నెక్ బార్నాకిల్స్ అంటార‌ని పేర్కొన్నారు. ఇవి అరుదైనవేకాక‌ రుచికరమైనవ‌ని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సీ ఫుడ్స్‌లో ఇది కూడా ఒక‌టని పేర్కొన్నారు. స్పెయిన్‌, పోర్చుగల్ లో వీటిని ఎక్కువ‌గా తింటార‌ని వెల్లడించారు.

Shocking : 24,000 ఏళ్లుగా మంచులోనే బతికే ఉన్న వింత జీవి..!

వీటి ధ‌ర కిలోకు రూ. 28వేల‌ వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు. వీటిని స్పెయిన్‌లోని కోస్టా డా మోర్టేలో నీటి అడుగున రాళ్లు, పగుళ్ల నుంచి సేక‌రిస్తార‌ని చెప్పారు. నిపుణులైన మత్స్యకారులు త‌మ ప్రాణాల‌కు తెగించి వీటిని ప‌ట్టుకొస్తార‌ని పేర్కొన్నారు. అందుకే వీటి ధ‌ర అధికంగా ఉంటుంద‌ని తెలిపారు.