Vegetable Vendor : తక్కువ ధరకు కూరగాయలు అమ్మిన వ్యాపారి.. జైలుకు పంపిన అధికారులు

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే తక్కువ రేట్లకు కూరగాయలు అమ్మడంతో అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన లాహోర్ లో జరిగింది. కరోనా కష్టకాలంలో ప్రజల బాధలు అర్ధం చేసుకున్న వ్యాపారి... తక్కువ ధరకు కూరగాయలు అమ్మారు. దీంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తోటి వ్యాపారులు పేచీ పెట్టారు.

Vegetable Vendor : తక్కువ ధరకు కూరగాయలు అమ్మిన వ్యాపారి.. జైలుకు పంపిన అధికారులు

Vegetable Vendor

Vegetable Vendor : ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు కూరగాయలు అమ్మితే అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువ రేటుకు అమ్మితే కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన మెమెన్, వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. వక్వాస్ అనే వ్యక్తి లాహోర్ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు.

కరోనా కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అర్ధం చేసుకొని ప్రభుత్వ ధరకంటే తక్కువకు కూరగాయలు అమ్మాడు. కిలో టమాటా ప్రభుత్వ ధర పాక్ రూ.50 ఉండగా అతడు 25కే ఇచ్చాడు. ఇక ఉల్లిగడ్డ పాక్ రూ. 40 ఉండగా 20కే ఇచ్చాడు. అయితే ఈ విషయంపై తోటివ్యాపారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ధరకంటే తక్కువకు అమ్మడం వలన తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అధికారులకు తెలిపారు.

దీంతో విచారణ జరిగిపిన అధికారులు ఆరోపణ నిజమని తేలడంతో పోలీస్ కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచడంతో అతడికి జైలు శిక్ష విధించింది కోర్టు.. మరుసటి రోజు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇక అధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.