Dog Circus: కొంచెం పక్కకు తప్పుకోండి సార్..! బాబోయ్ ఇది ఖతర్నాక్ కుక్కపిల్ల .. వీడియో వైరల్

మనం ఇంట్లో పెంచుకొనే, వీధుల్లో ఉండే కుక్క పిల్లలు చలాకీగా ఉంటాయి. అవిచేసే వింత చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. తాజాగా ఓ కుక్క పిల్ల పొడవాటి కర్రను నోటకర్చుకొని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dog Circus: కొంచెం పక్కకు తప్పుకోండి సార్..! బాబోయ్ ఇది ఖతర్నాక్ కుక్కపిల్ల .. వీడియో వైరల్

Dog Circus

Dog Circus: మనం ఇంట్లో పెంచుకొనే, వీధుల్లో ఉండే కుక్క పిల్లలు చలాకీగా ఉంటాయి. అవిచేసే వింత చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. తాజాగా ఓ కుక్క పిల్ల పొడవాటి కర్రను నోటకర్చుకొని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్.. ఇది ఖతర్నాక్ కుక్క పిల్ల అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను హెకిన్ గుడ్ డాగ్స్ అనే ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి శీర్షిక.. Excuse me, Sir! అని ఇచ్చారు. ఈ వీడియోలో రెండు చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. అడవి ప్రాంతంలో ఓ చిన్నపాటి మట్టి రహదారిలో ఈ కుక్కలు ఉన్నాయి. ఆ చిన్న రహదారిలో మనుషులు రాకపోకలు సాగిస్తున్నారు. చుట్టూ పిచ్చిమొక్కలు, చెట్లు ఉన్నాయి. ఈ రోడ్డులో ఓ కుక్కపిల్ల పెద్ద సాహసం చేసింది. పొడవాటి కర్రను నోటకర్చుకుంది. ముందు తెల్లటి కుక్కపిల్ల వెళ్తుంటే దాని వెనుకాల ఈ కుక్కపిల్ల కర్రను తీసుకెళ్తుంది. ఇంతలోనే ఎదురుగా మనుషులు వచ్చినా అది కర్రను వీడకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కుక్కపిల్ల ప్రయత్నాన్ని చూసి వారు ఆ కర్రను దాటుకొని వెళ్లిపోయారు.

ఈ కుక్కపిల్ల చేసిన చిన్నపాటి సర్కస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది వీక్షించారు. వేలమంది ట్వీట్లుచేసి కుక్క పిల్ల ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ రీ ట్వీట్లు చేశారు. ఓ నెటిజన్ ‘ రీజనల్ బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు’ తప్పుకోండి అంటూ రీట్వీట్ చేశాడు. మరో నెటిజన్ ఈ కుక్క పిల్ల పెద్ద సాహసమే చేస్తోంది అంటూ రాశాడు. ఇలా వీడియోలో కుక్క పిల్ల చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.