Moscow : మాస్కో హిందూ దేవాలయంలో రష్యన్ పూజారి!

Moscow : మాస్కో హిందూ దేవాలయంలో రష్యన్ పూజారి!

Temple

Western Hindu priestess : హిందూ ఆలయంలో పూజారులుగా ఎవరు ఉంటారు ? మగవారే ఉంటారు. వారే భక్తులను ఆశీర్వదిస్తుంటారు..పూజలు చేస్తుంటారు కదా. అదే స్త్రీలు ఎందుకు పూజారులు కాకూడదు. వారిని గర్భగుడి దరిదాపుల్లోకి ఎందుకు రానివ్వరు ? కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే..ఓ హిందూ దేవాలయంలో పాశ్చాత్య హిందూ పూజారీగా మహిళ ఉండడం విశేషం.

కాలానికి అనుగుణంగా..సంప్రదాయాలను మార్చుకొంటేనే…సమాజం ముందుకు పోగలదని అంటుంటారు. గతంలో ఇలా చాలా సంప్రదాయాలను మార్చుకున్నారు. ప్రధానంగా..మహిళలు, అంటరానివారు, శూద్రులు, విద్యకు అర్హులు కారని అన్నారు. కానీ పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక యుగంలో ఏ రంగంలోనైనా..మహిళలు రాణిస్తున్నారు. ఏం పురుషులు చేయాలా ? అని ప్రశ్నిస్తున్నారు. కుల సమాజం, మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందనడానికి పలు ఘటనలే నిదర్శనం. స్త్రీల ఆలయ ప్రవేశాన్ని..అందులో పూజారులుగా నిషేధిస్తోంది ఈ పురాషాధిక్యత భావజాలం. సమానత్వాన్ని మహిళలు కోరుకుంటున్నారు.

अखण्ड भारत @Sandy49363539 పేరిట 2021, మార్చి 21వ తేదీన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ఫొటో తెగ వైరల్ గా మారింది. మాస్కోలోని ఓ దేవాలయంలో హిందూ మతానికి చెందిన మగ వ్యక్తిని..పాశ్చాత్య బ్రాహ్మణేతర మహిళా పూజారీ ఆశీర్వదిస్తున్నారు. సనాతన ధర్మం అభివృద్ధి చెందుతోందని, పూజారీగా ఉండటానికి మగవారు లేదా..హిందూ కుటుంబంలో జన్మించాలా ? పూజారీగా ఉండటానికి బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదని ట్వీట్ లో పొందుపరిచాడు. దీనికి నెటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

హిందూ మతంలో బోధించే సమానత్వం, కొంతమంది అమలు చేయడంలో విఫలమౌతున్నారని अखण्ड भारत @Sandy49363539 ఓ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు. హిందూ మతంలో సమానత్వం బోధించబడలేదని, ఇది ఆచారాలు, సంప్రదాయ రూపంలో ఆచరించబడుతోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి అతను చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఇప్పటి వరకు…10.8 K లైక్స్ రాగా…2 వేల 222 మంది రీ ట్వీట్ చేశారు.