long Fingernails : 24 అడుగుల పొడవున చేతిగోర్లను పెంచుకున్న మహిళ..30 సంవత్సరాల తరువాత కత్తిరించింది

మహిళలకు చేతి గోర్లు పెంచడమంటే చాలా ఇష్టం. అమ్మాయిల అందాల్లో అదీ ఒకటి. పొడవైన గోర్లుకు నెయిల్ పాలిష్ పెట్టి వాటిని మరింత అందంగా తీర్చిదిద్దుతారు.

long Fingernails : 24 అడుగుల పొడవున చేతిగోర్లను పెంచుకున్న మహిళ..30 సంవత్సరాల తరువాత కత్తిరించింది

Long Fingernails

A woman cut her fingernails 30 years later : మహిళలకు చేతి గోర్లు పెంచడమంటే చాలా ఇష్టం. అమ్మాయిల అందాల్లో అదీ ఒకటి. పొడవైన గోర్లుకు నెయిల్ పాలిష్ పెట్టి వాటిని మరింత అందంగా తీర్చిదిద్దుతారు. దాదాపు అందరు అమ్మాయిలూ ఇలాగే చేస్తుంటారు. ఎంత ఇష్టమైనా గోర్లను సెంటీమీటర్‌కి మించి పెంచరు. కానీ ఆ మహిళ ఏకంగా 24 అడుగుల పొడవున గోర్లను పెంచేసింది. ఒక రోజో, నెలో కాదండోయ్.. దాదాపు 30 సంవత్సరాల పాటు ఆమె గోర్లను పెంచుకుంది. కానీ ఏం లాభం ఎంత పెరిగినా.. చివరికి కత్తిరించాల్సిందే కదా.. ఆ మహిళా అదే పని చేసింది.

హ్యూస్టన్‌కు చెందిన అయన్నా విలియమ్స్ అనే మహిళ 2017లో ప్రపంచంలోనే అతి పొడవైన చేతి గోర్లు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. 2017లో చేతి గోర్లను దాదాపు 19 అడుగుల పొడవు పెంచారు. చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టేందుకు ఆమెకు 20 గంటల సమయం పట్టేది.

30 సంవత్సరాలు గోర్లను పెంచిన విలియమ్స్.. చివరికి వాటిని కత్తిరించక తప్పలేదు. టెక్సాస్‌లోని చర్మవ్యాధి కార్యాలయంలో విలియమ్స్ చేతి గోర్లను కట్ చేశారు. 1990 తరువాత మళ్లీ 30 ఏళ్లకు గోర్లు కట్ చేయడానికి విద్యుత్ రోటరీ పరికరాన్ని ఉపయోగించారు. చేతి గోర్లు కత్తిరించే ముందు.. నాలుగు నెయిల్ పాలిష్ బాటిల్స్‌తో గోర్లను అందంగా తీర్చిదిద్దింది.

చేతి గోర్లు కత్తిరించిన తరువాత.. ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు విలియమ్స్ తెలిపారు. ఇప్పటివరకు వంట పని, ఇంటి పని చేసేందుకు ఇబ్బందులు పడిన మహిళ.. ఇప్పుడు అన్ని పనులను అలవోకగా చేసుంటానని చెబుతోంది.