కరోనా పేషెంట్ కేఫ్‌కు వెళ్లి 27 మందికి అంటించింది

కరోనా పేషెంట్ కేఫ్‌కు వెళ్లి 27 మందికి అంటించింది

కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన మహిళ ఇంట్లో కూర్చొని ఉండక స్టార్‌బక్స్ కేఫ్‌కు వెళ్లింది. అంతే ఆమెతో పాటు అక్కడకు వచ్చిన వారందరికీ వైరస్ వ్యాపించి కొద్ది రోజుల పాజిటివ్ గా తేలింది. ఆ సీన్ నుంచి సేఫ్ అయినవారు ఎవరైనా ఉన్నారంటే.. అది మాస్క్ పెట్టుకుని ఉన్న నలుగురు ఎంప్లాయీస్ మాత్రమే.



ఆగష్టు 8న జరిగిన ఈ ఘటన దక్షిణ కొరియాలో నాలుగు గోడల మధ్య కరోనా వ్యాప్తి ఎంత వేగంగా జరుగుతుందో చెప్తుంది. అదే టైంలో కరోనా వ్యాప్తి కాకుండా ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. ఆ రోజు ఫేస్ మాస్క్ పెట్టుకుని ఉండటంతో ఎయిర్ కండిషన్డ్ రూంలో 27మందికి సోకిన కరోనా మాస్క్ పెట్టుకున్న వారిని చేరలేకపోయింది.

‘మాస్క్ ల పాత్ర అర్థమవుతోంది. మాస్కులు 100శాతం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవచ్చు. కానీ, అసలే జాగ్రత్త తీసుకోకపోవడం కంటే ఇది పరవాలేదు’ అని మా సంగ్ హ్యూక్ అంటున్నారు.



ఆస్ట్రేలియా నుంచి వెనెజులా వరకూ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఫేస్ మాస్క్ లు ఎలా వినియోగించాలో చెప్తున్నారు. ఈ మహమ్మారి కారణంగా మొత్తం 23మిలియన్ మంది ఎఫెక్ట్ కాగా, 8లక్షల 10వేల మంది మృత్యువాతపడ్డారు. న్యూజిలాండ్ లో అయితే ఫేస్ కవరింగ్ తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, షేరింగ్ వెహికల్స్ లలో మాస్క్ లు లేకుండా నో ఎంట్రీ ని ప్రధానమంత్రి జాసిండా అర్డెర్న్ సోమవారం వెల్లడించారు. గతవారం WHOకూడా పిల్లలు మాస్క్ వాడడంపై కీలక మెసేజ్ ఇచ్చింది.

అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ చాలా మంది షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ లోకి ఎంటర్ అయ్యేముందు మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు. వీలైనంత వరకూ మాస్క్ పెట్టుకోవడానికి నో చెప్తే స్టార్ బక్స్ లో వ్యాప్తి చెందినట్లుగా మిగిలిన వారికి జరుగుతుందంటూ కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్షన్ హెడ్ జుంగ్ యున్-కియోంగ్ చెప్తున్నారు.



ఆగష్టు 8న కరోనా పేషెంట్ స్టార్ బక్స్ కు వచ్చి వెళ్తే ఆగష్టు 24నాటికి ఆ వైరస్ అదే ప్రాంతంలో మూడు డజన్ల మందికి వ్యాప్తి జరిగింది. ఈ వారంలో మరో 3వేల మంది వరకూ సోకే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దక్షిణకొరియా ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలని చెప్తూనే ఉంది. సియోల్ ప్రాంతం కరోనా వైరస్ కు హాట్ స్పాట్ కావడంతో ఇండోర్, అవుట్ డోర్ ప్రాంతాల్లోనూ మాస్క్ లు పెట్టుకునే ఉండాలని ప్రభుత్వం ఆర్డర్ వేసింది.