Irfan Pathan : మీకూ, మాకూ ఉన్న తేడా అదే.. పాక్ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత మాజీ క్రికెటర్

టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన ట్వీట్ కు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగిపోయే రీతిలో బదులిచ్చాడు.

Irfan Pathan : మీకూ, మాకూ ఉన్న తేడా అదే.. పాక్ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత మాజీ క్రికెటర్

Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టుపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ 152/0 వర్సెస్ 170/0 గా ఉంటుందంటూ టీమిండియాను ఉద్దేశించి షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు టీమిండియా ఫ్యాన్స్ ఘాటుగానే బదులిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం దీనిపై స్పందించాడు. పాక్ ప్రధానికి దిమ్మతిరిగిపోయే రీతిలో బదులిచ్చాడు.

”భారత్ కు, పాకిస్థాన్ కు ఉన్న తేడా ఇదే. మేం మా సంతోషాన్ని మా విజయంలో వెతుక్కుంటాం. కానీ మీరు.. పొరుగు వారి బాధలు, కష్టాల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు. అందుకే మీ దేశం పట్ల, మీ ప్రజల బాగోగుల పట్ల మీరు దృష్టి సారించలేకపోతున్నారు. ముందుగా మీరు మీ దేశాన్ని బాగు చేయడంపై శ్రద్ధ పెట్టండి” అంటూ పఠాన్ ట్విట్టర్ లో ఘాటు రిప్లయ్ ఇచ్చాడు. మీకూ, మాకూ ఉన్న తేడా అదేనంటూ పఠాన్ ఇచ్చిన రిప్లయ్ పాక్ ప్రధానికి గట్టిగానే తగిలిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో అదిరిపోయే రిప్లయ్ ఇచ్చాడు.