Abdul Rehman Makki: అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.. గతంలో భారత్ ప్రయత్నాన్ని అడ్డుకున్న చైనా

అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.

Abdul Rehman Makki: ఉగ్రవాద నిధులను సేకరించడం, యువతను దాడికి ప్రేరేపించడం, భారత్‌పై ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నాడన్న నెపంతో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ మక్కీని ఐక్యరాజ్య సమితి (యుఎన్ఎస్‌సీ) గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267ఐఎస్ఐఎల్ (దయిష్), ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించారు.

Terrorist Arrest : ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. పాకిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు

మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం.. మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. జమ్మూ కశ్మీర్‌లో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకలాపాలకోసం జమ్మూ కశ్మీర్‌లో నిధుల సేకరణ, యువతను హింసకు ప్రోత్సహించడం, దాడులకు ప్లాన్ చేయడంలో మక్కీ నిమగ్నమయ్యాడని ఎప్పుడినుంచో భారత్ వాదిస్తోంది. అయితే, 2020లో పాకిస్థానీ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం మక్కీని ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేశాడని నిర్ధారించింది. దీనికితోడు అతనికి జైలు శిక్ష విధించింది.

 

గతకొంతకాలంగా పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించడంలో చైనా అడ్డంకులు సృష్టిస్తుంది. పాకిస్థాన్ ఆధారిత, యూఎన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థ జేఎఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను చైనా పదేపదే అడ్డుకుంది.

ట్రెండింగ్ వార్తలు