వెల్ కమ్ వాయు అభినందన: భారత్ కు వచ్చే ముందు జరిగిన ప్రాసెస్ ఇదే!

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 11:21 AM IST
వెల్ కమ్ వాయు అభినందన: భారత్ కు వచ్చే ముందు జరిగిన ప్రాసెస్ ఇదే!

ఏఐఎఫ్‌ వింగ్‌ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ ను భారత్‌కు పాకిస్తాన్ అప్పగించింది. వాఘా సరిహద్దుకు అభినందన్‌ వర్ధమాన్ చేరుకోవడంతో ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది భారతీయులు జైహింద్, భారత్‌ మాతాకీ జై నినాదాతో హోరెత్తించారు. మువ్వన్నెల జెండాలతో వెల్ కమ్ వాయు అభినందన అంటూ స్వాగతం పలికారు. అంతకుముందు వాఘా సరిహద్దు వద్దకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చేరుకుని అభినందన్‌కు చెందిన పౌర ధ్రువీకరణ, పాస్‌పోర్టు, సర్వీసు రికార్డుల పత్రాలను పాక్‌ విదేశాంగ అధికారులకు అందజేసి విడుదల చేసేందుకు ప్రాసెస్ ను పూర్తి చేశారు.
Read Also : ఉప్పల్‌లో వన్డే: కేఎల్ రాహుల్‌ కొనసాగుతాడా? షమీ, కుల్దీప్‌ల సంగతేంటి?

పాకిస్తాన్ లోని భారత హైకమిషనర్‌ గౌరవ్‌ అహ్లూవాలియా వాటిని అధికారులకు అందజేశారు. అంతకుముందు భారత్‌ వింగ్‌ కమాండర్ అభినందన్‌ ను భారత్ కు అప్పగించే ప్రాసెస్ ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. ఆయనను విడుదల చేయకూడదంటూ అక్కడి పౌర హక్కుల వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయగా ఆయనను విడుదల చేయాల్సిందేనంటూ అధికారులకు సూచించింది.

అనంతరం పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్‌ వర్ధమాన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానంను పంపిస్తామంటూ భారత్ పాకిస్తాన్ కు చెప్పింది. అందుకు పాకిస్తాన్ నిరాకరించి రోడ్డు మార్గం ద్వారా వాఘా సరిహద్దు దగ్గర అభినందన్‌ను అప్పగించింది.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు