ADANI : అదానీకి షాక్ ఇచ్చిన అమెరికా..యూఎస్ స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించాలని నిర్ణయం
అదానీకి షాక్ ఇచ్చిన అమెరికా..యూఎస్ స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించాలని నిర్ణయం.

ADANI : హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్‌తో అదానీ కంపెనీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనుచూపుమేర కనిపించడం లేదు. వరుసగా రెండో వారం కూడా షేర్లు నేలచూపులే చూస్తున్నాయి. అసలే కోలుకోలేని దుస్థితిలో అదానీ కంపెనీ షేర్లు నానా పాట్లు పడుతుంటో మరోవైపు అదానీకి అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎస్ అండ్ పీ డౌజోన్స్ ప్రకటించింది. అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది డౌజోన్స్. అమెరికా సంస్థ డోజోన్స్ సస్టెయినబిలిటీ సూచీ నుంచి అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లను తొలగిస్తున్నట్లుగా నిర్ణయిం తీసుకున్నారు. ఫిబ్రవరి (2023)నుంచి ఈ నిర్ణయం అమలులోకిరానుంది.
స్టాక్‌మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. ఇవాళ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసినా.. అదానీ గ్రూప్ షేర్ల పతనం మాత్రం ఆగలేదు. అదానీ గ్రూప్‌లో ఏకంగా ఆరు కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్..ఓ దశలో 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే.. చివరకు కోలుకుని నిన్నటికంటే కేవలం ఒక శాతం లాభాలతో ముగిసింది. అదానీ పోర్ట్స్ మాత్రం 7.87 శాతం లాభాలతో ముగిసింది. అంబుజా సిమెంట్స్ 5.97 శాతం, ఏసీసీ 4.64 శాతం లాభపడ్డాయి. మిగిలిన కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో.. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది.
జనవరి 24 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.19.20 లక్షల కోట్లు ఉండగా.. కేవలం ఏడంటే ఏడు ట్రేడింగ్ సెషన్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా విలువ ఆవిరైపోయింది. అటు.. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 17 స్థానానికి పడిపోయారు అదానీ. ఉదయం అన్ని కంపెనీల షేర్లు నేలచూపులు చూడడంతో.. ఓ దశలో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు అదానీ. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ లాభాల్లో ముగియడంతో 17వ స్థానానికి చేరుకున్నారు.
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్.. ఇవాళ దాదాపు 14 శాతం నష్టపోయింది. డిసెంబర్20న జీవితకాల గరిష్ట స్థాయి 4వేల 190 రూపాయలు పలికిన అదానీ ఎంటర్‌ప్రైజెస్.. ఇవాళ ఉదయం 52 వారాల కనిష్టస్థాయి ఒక వెయ్యి 17 రూపాయలకు పడిపోయింది. కేవలం నెలన్నర రోజుల్లోనే 3 వేల 173 రూపాయలను నష్టపోయింది. ఈ నెల ఒకటో తేదీన దాదాపు 2.43 లక్షల కోట్లుగా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ విలువ.. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 60 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది.
స్టాక్ మార్కెట్‌లో ఇంత భారీగా అదానీ గ్రూప్ షేర్లు నష్టాలను మూటగట్టుకోవడం.. ఆ కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకుల్లో టెన్షన్ రేపుతోంది. అదానీ గ్రూప్‌కు దాదాపు 27 వేల కోట్ల రుణాలను ఇచ్చింది ఎస్‌బీఐ. ఇక తర్వాతిస్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. దాదాపు 7వేల కోట్ల రుణాలను అదానీ గ్రూప్‌కు ఇచ్చింది PNB. అదానీ గ్రూప్ కుదేలైతే.. దాని ప్రభావం ఈ బ్యాంక్‌లపై కూడా పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంక్‌లపై పడే ప్రభావంపై ఆరా తీస్తోంది. జనవరి 31 నాటికి అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల వివరాలు, అదానీ గ్రూప్ ఉన్న బకాయిల వివరాలను సమర్పించాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈక్రమంలో అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్‌ను సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ల్లో ప్రధానమైన డౌజోన్స్ ప్రకటించింది. అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది డౌజోన్స్.