Afghan Plane : కుప్పకూలిన అప్ఘాన్ మిలటరీ విమానం

అప్ఘానిస్తాన్ మిలటరీ విమానం కుప్పకూలిపోయింది.

Afghan Plane : కుప్పకూలిన అప్ఘాన్ మిలటరీ విమానం

Plane

Afghan Plane అప్ఘానిస్తాన్ మిలటరీ విమానం కుప్పకూలిపోయింది. ఉజ్బెకిస్తాన్ బోర్డర్ లోకి ప్రవేశించిన తర్వాత విమానం క్రాష్ అయినట్లు సమాచారం. ఈ విష‌యాన్ని ఉజ్బెకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ ఇవాళ ధృవీక‌రించింది. ఆదివారం రాత్రి కన్పించకుండా పోయిన అప్ఘాన్ మిలిట‌రీ విమానం అప్ఘానిస్తాన్ స‌రిహ‌ద్దుని ఆనుకుని ఉన్న ఉజ్బెకిస్తాన్ ద‌క్షిణాది ప్రావిన్స్ స‌ర్ఖోండార్యోలో కూలిపోయి ఉంటుందంటూ ఇప్ప‌టికే మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్న నేపథ్యంలో… తాజాగా ఆ క‌థ‌నాలు వాస్త‌వ‌మేన‌ని ఉజ్బెకిస్థాన్ ప్ర‌భుత్వం ధృవీక‌రించింది.

ఉజ్బెకిస్తాన్ రక్షణశాఖ తెలిపిన వివరాల ప్రకారం..పైలట్ విమానంలోకి కిందకు దూకి తప్పించుకున్నాడు. అయితే ఈ విమానం అక్రమంగా బోర్డర్ దాటి తమ దేశంలోకి ప్రవేవించిందని ఉజ్బెకిస్తాన్ చెబుతోంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది.

ఆదివారం సాయంత్రం అఫ్ఘాన్ మిలిటరీ యూనిఫామ్ ధరించిన ఇద్దరు రోగులను తన ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సుర్ఖోండారియో ప్రావిన్స్‌లోని డాక్టర్ బెక్‌పులాట్ ఓక్బోయేవ్ తెలిపారు. రోగులలో ఒక వ్యక్తి “పారాచూట్‌తో” తమ హాస్పిటల్ దగ్గరికి వచ్చినట్లు డాక్టర్ తెలిపాడు.

మరోవైపు,  తాలిబన్లు అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తీసుకోవడంతో.. ఆదివారం ఉదయం సరిహద్దు దాటికి ఉజ్బెకిస్తాన్ లోకి ప్రవేశించిన 84 మంది అఫ్ఘాన్ సైనికులను అదుపులోకి తీసుకున్నామని, సైనికులను తిరిగి అప్పగించే విషయమై అఫ్ఘాన్‌తో చర్చలు జరుపుతున్నామని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది.