Afghan women: అఫ్ఘాన్‌లో మహిళల హక్కుల కోసం తాలిబాన్‌లకు వ్యతిరేకంగా నిరసనలు

అప్ఘానిస్తాన్‌లో రెండు దశాబ్దాల తర్వాత అధికారంలోకి వచ్చిన తాలిబన్లు అఫ్ఘాన్‌లో పరిస్థితిని దారుణంగా తయారుచేస్తున్నారు.

Afghan women: అఫ్ఘాన్‌లో మహిళల హక్కుల కోసం తాలిబాన్‌లకు వ్యతిరేకంగా నిరసనలు

Taliban Protest

Afghan women: అప్ఘానిస్తాన్‌లో రెండు దశాబ్దాల తర్వాత అధికారంలోకి వచ్చిన తాలిబన్లు అఫ్ఘాన్‌లో పరిస్థితిని దారుణంగా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. తాలిబాన్లు మహిళల వియంలో నిరంతరం కొత్త విధానాలను అమల్లోకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే బాలికలు పాఠశాలకు వెళ్లడాన్ని నిషేధించారు. అనంతరం.. రాజధాని కాబూల్‌లో తాలిబాన్ విధానాలకు వ్యతిరేకంగా మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక మీడియా నివేదికలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ మహిళలు అధిక సంఖ్యలో సమాన హక్కులు మరియు కాబూల్‌లో మహిళలకు పని చేసుకోవాలనే అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌తో రోడ్లపైకి వచ్చారు.

నిరసనకారులుగా మారిన మహిళలు.. తాలిబాన్లకు వ్యతిరేకంగా నినాదాలను ఇచ్చారు. మహిళలకూ భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఉంది. మా శక్తికి హిరించే శక్తి ఎవరికీ లేదు.. విద్య మరియూ ఉద్యోగం మా హక్కు.. అంటూ వారు నినాదాలు చేశారు. షరియా చట్టం ప్రకారం మహిళలకు శక్తివంతమైన మరియు సమర్థవంతమైన పాలన ఏర్పాటు చేస్తామని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, మహిళలకు అనుకూలంగా తాలిబాన్ల ప్రభుత్వం ఏ మాత్రం లేదనేది అక్కడి మహిళల వాదన. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలైతే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని వారు అంటున్నారు.

ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మరియు ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్) ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల పాఠశాలలను మూసివేయడం విద్య ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే ఈమేరకు చేసిన ఓ ప్రకటనలో బాలికల పాఠశాలలు మూసివేయడం కచ్చితంగా వారి హక్కులను హరించడమే అని మహిళల విద్యపై ప్రాథమిక హక్కును ఉల్లంఘించడం సరికాదని టోలో న్యూస్ నివేదించింది.

ఆండ్రీ అజౌలే మాట్లాడుతూ, “బాలికలను పాఠశాలకు అనుమతించకపోతే, కోలుకోలేని పరిణామాలు ఉంటాయని యునెస్కో అమెరికాను హెచ్చరించింది. ప్రత్యేకించి బాలికలు మాధ్యమిక పాఠశాలకు వెళ్లకపోవడం వల్ల వారు విద్య మరియు జీవితంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. దీంతో బాల్య వివాహ ప్రమాదం పెరుగిపోతుంది. ఇది అబ్బాయిలు మరియు బాలికల మధ్య అసమానతలను విస్తృతం చేస్తుంది.’అని అన్నారు.