Afghanistan : అప్ఘానిస్తాన్‌లో ఆకలి కేకలు : విరాళాలపై బతుకీడుస్తున్న అప్ఘాన్లు..!

అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. దీనికి తోడు ఆహారపు సంక్షోభం తలెత్తింది.

Taliban fighters surviving on donation : అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. దీనికి తోడు ఆహారపు సంక్షోభం తలెత్తింది. పూట భోజనం చేయడమే కష్టంగా ఉంది అక్కడి అప్ఘాన్ల పరిస్థితి. తాలిబన్ల భయంతో ఆహారం లేక అప్ఘాన్ వాసులు దేశం దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అప్ఘానిస్తాన్‌లో 30శాతానికిపైగా ప్రజలు కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియదని ఐక్యరాజ్య సమితి (UN) ఒక ప్రకటనలో పేర్కొంది. నాలుగు మిలియన్ల మంది అప్ఘాన్లు ఆహర సంక్షోభంతో అల్లాడిపోతున్నారని తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో 36 మిలియన్ల మందికి రానున్న రోజుల్లో తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతమున్న ఆహార నిల్వలు ఖాళీ అయ్యే పరిస్థితి దగ్గర పడటం, ఆర్థిక సాయం అందక అనేక అప్ఘాన్ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అప్ఘాన్‌లో ఉన్న ఆహార నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్‌ అధికారి రమిజ్ అలాక్బరోవ్ పేర్కొన్నారు.
United Nations : అఫ్ఘాన్ కు రూ.8,836 కోట్ల ఆర్ధిక సాయం

తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అఫ్ఘానిస్తాన్ నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచ నిధులు కూడా స్తంభింపజేయడంతో బ్యాంక్ ఖాతాల్లోని నగదు ఉపసంహరణపై కూడా రోజువారీ పరిమితులు విధించాయి. చాలా మంది తాలిబాన్ యోధులు నెలల తరబడి డబ్బు అందుకోలేని పరిస్థితి ఎదురైంది. అఫ్ఘానిస్తాన్ తాలిబాన్ల అధికార పాలనను గుర్తించడానికి చాలా దేశాలు నిరాకరించాయి. తాలిబాన్ స్వాధీనం అనంతరం విదేశీ సాయం నిలిచిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ బ్యాంకు రుణాలను కూడా నిలిపివేసాయి. యునైటెడ్ స్టేట్స్ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ వద్ద 9.4 బిలియన్ డాలర్ల నగదు నిల్వలను నిలిపివేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తాలిబాన్ ఆస్తులను బ్లాక్ చేయాలంటూ 39 సభ్య దేశాలను కోరింది. దాంతో అఫ్ఘానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ధరలు పెరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ జనాభాలో 97 శాతం మంది త్వరలో దారిద్య్రరేఖకు దిగువకు వెళ్లవచ్చునని యూఎన్ హెచ్చరించింది.

ప్రధాన నగరాల్లో గణనీయమైన సంఖ్యలో తాలిబాన్ పోరాట యోధులు దొరికిన తక్కువ ఆహారంతోనే గడిపేస్తున్నారని, తగిన ఆశ్రయం లేక ట్రక్కుల్లో నిద్రపోతున్నారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. పౌరులపై తాలిబాన్లు ఇప్పటికే 200 విత్‌డ్రా పరిమితిని విధించారు. నగదు కోసం క్యూలలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదరవుతోంది. తాలిబాన్ స్వాధీనం తరువాత చాలా బ్యాంకులు మూసేవేశారు. తెరిచిన బ్యాంకుల్లో పరిమిత నగదు విత్ డ్రా చేసుకునే వీలుంది. సోమవారం జెనీవాలో జరిగిన UN సమావేశంలో, అంతర్జాతీయ సమాజం అఫ్ఘానిస్తాన్ ప్రజలకు 1 బిలియన్ డాలర్లకు పైగా మానవతా సహాయాన్ని అందిస్తామని హామి ఇచ్చింది. తాలిబన్ పోరాట యోధులు ఇప్పుడు ప్రపంచ దేశాలందించే విరాళాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
PM Modi : ఐరన్ స్ర్కాప్‌తో 14 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహం..!

ట్రెండింగ్ వార్తలు