Talibans : బహిరంగంగా నలుగురి చేతులు నరికివేసిన తాలిబన్లు

తాలిబన్ల క్రూరత్వం మరోసారి బయటపడింది. అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించుకుని పాలన చేపట్టినా వారి పైశాచిక్వం మాత్రం మానలేదు. మనుషుల్ని అత్యంత దారుణంగా చంపే వారి సహజగుణం కొనసాగిస్తు అత్యంత దారుణంగా.. బహిరంగంగా వందలాదిమంది చూస్తుండగా నలుగురు వ్యక్తుల చేతులు నరికివేశారు.

Talibans : బహిరంగంగా నలుగురి చేతులు నరికివేసిన తాలిబన్లు

Talibans

Talibans :  తాలిబన్ల క్రూరత్వం మరోసారి బయటపడింది. అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించుకుని పాలన చేపట్టినా వారి పైశాచిక్వం మాత్రం మానలేదు. మహిళల చదువులపై ఆంక్షలేకాదు..దేశంలో కరవు విలయతాండం ఆడుతుంటే దాన్ని రూపు మాపే యత్నాలు పక్కన పెట్టి వారి పైశాచికత్వాన్ని మరింతగా పెంచిపోషించుకుంటున్నారు. మనుషుల్ని అత్యంత దారుణంగా చంపే వారి సహజగుణం మాత్రం కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే నలుగురు వ్యక్తులను అత్యంత దారుణంగా బహిరంగంగా వందలాదిమంది చూస్తుండగా చేతులు నరికివేశారు. వారు దొంగతనం చేశారు కాబట్టి చేతులు నరికివేశామని చెప్పుకుంటున్నారు.

కడుపు కాలితే ఎంత మంచివాడైనా దొంగగా మారతాడు అని అంటారు. ఆకలి అటువంటిది. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు చేతుల్ని నరికివేసి మరోసారి తాలిబన్ల క్రూరత్వం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చాటిచెప్పారు. దొంగతనం చేస్తే పోలీసులు అరెస్ట్ చేయాలి..కోర్టు శిక్ష విధించాలి. కానీ అది తాలిబన్ల రాజ్యం..వారు చెప్పిందే చట్టం..చేసిందే శాసనం అందుకే వారే స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగతనం చేసారనే ఆరోపణలు నలుగురు చేతుల్ని బహిరంగంగా నరికివేశారు కాందహార్‌లోని అహ్మద్ షాహి ఫుట్‌బాల్ స్టేడియంలో.

వందలాది మంది చూస్తుండగానే తాలిబన్లు ఈ శిక్షను బహిరంగంగా అమలు చేశారు.అంతేకాదు కాదు నేరాలు చేసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మందిని కొరడా దెబ్బలతో శిక్షించారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి హజీ జైద్ స్వయంగా తెలిపారు. నిందితులను 35 నుంచి 39సార్లు కొరడాలతో కొట్టారని తెలిపారు. చట్టం అనేది లేదు తాలిబన్ల రాజ్యంలో. వారే స్వయంగా అనాగరిక శిక్షలు విధిస్తుంటారు అనటానికి ఈ ఘటన మరో ఉదాహరణం అని తెలుస్తోంది.

తాలిమన్లు ఈ శిక్షను అమలు చేసే సమయంలో మత పెద్దలు అక్కడే ఉన్నారు. వారితో పాటు వందలాదిమంది స్థానికులు కూడా ఉన్నారు. శిక్ష కోసం ఎదురుచూస్తూ 9 మంది స్టేడియంలో కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మానవ హక్కుల న్యాయవాది, ఆఫ్ఘనిస్థాన్ రీసెటిల్‌మెంట్, రిఫ్యూజీ మంత్రిత్వశాఖ మాజీ సలహాదారు షబ్నమ్ నాసిమి ఈ ఫొటోలను షేర్ చేశారు. చరిత్ర పునారావృతం అయిందని, 1990ల నాటి బహిరంగ శిక్షల అమలు మళ్లీ మొదలైందని ఆఫ్ఘాన్ జర్నలిస్ట్ తాజుదెన్ సోరౌష్ ఆవేదన వ్యక్తం చేస్తూ స్టేడియం వెలుపలి దృశ్యాలకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.